కావలసినవి:
కొత్తిమీర కట్టలు - రెండు, చింతపండు - నిమ్మకాయ సైజు,మెంతులు - ఒక స్పూన్ ,ఆవాలు - రెండు స్పూన్లు, పోపుకి ఆవాలు - ఒక స్పూన్ , జీలకర్ర - అర స్పూన్, పచ్చిశనగపప్పు - ఒక స్పూన్, మినప గుళ్ళు - ఒక స్పూన్, వెల్లుల్లి - 15 రెబ్బలు ,ఎండుమిర్చి - రెండు, కరివేపాకు కొంచెం. కారం - 4 స్పూన్లు ,ఉప్పు - రెండు స్పూన్లు.
చేసే విధానం:
కొత్తిమీర కట్టలు పెద్దవి తీసుకొని శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ మీద విడదీసి ఆరనివ్వాలి. ఎండలో ఆరబెట్టకూడదు. ఇది కట్ చేసి ఒక కప్పుతో మెజర్మెంట్ చేసుకోండి. నాలుగు కప్పుల ఆకు వచ్చింది. ఆకుకి ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఒక పళ్ళెంలో బాగా విడదీసి ఆర పెట్టుకోండి.
అరకప్పు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. కొంచెం పసుపు వేయండి. రెండు మూడు పొంగుల ఉడుకు పట్టాక ఆఫ్ చేసి చల్లార పెట్టుకోండి. అంతలో ఒక పాన్ తీసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి ఎర్రగా వేగాక ఆవాలు కూడా వేసి రెండు నిమిషాలు వేపుకోవాలి.
వీటిని చల్లారపెట్టండి. మిక్సీ జార్ లో మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పాన్లో పావు కప్పు నూనె వేసి అందులో cut చేసిన కొత్తిమీర ని వేసుకోండి. కొంచెం సేపు మగ్గనివ్వండి. తీసి చల్లార పెట్టండి.
మళ్లీ పాన్లో కొంచెం నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప గుళ్ళు ఇవి వేగిన తర్వాత పది వెల్లుల్లి రేకలు కూడా వేసి వేపుకోవాలి. తర్వాత రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి, ఉడికించి పెట్టుకున్న చింతపండులో ఆవాలు మెంతులు, పొడి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాము కదా అది కూడా చింతపండు గుజ్జులో వేసుకోవాలి.
కారం, ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర ఆకుని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆకులు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. నూనె సరిపడకపోతే వెయ్యాలనుకుంటే దానిని కాచి చల్లార్చి కలుపుకోండి.


