Avakaya Pachadi : ఆహా ఏమి రుచి తినరా మైమరచి అని మురిపించే మన ఆంధ్ర special ఆవకాయ రంగు రుచి పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇలా చేద్దాం.
కావలసిన పదార్థాలు:
ఒక కేజీ మామిడికాయ ముక్కలు, 180 గ్రా ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, 300 గ్రా పప్పు నూనె, 180 గ్రా or ఒక కప్పు పచ్చడి కారం,180 గ్రా or 3/4 cup salt (గట్టి ఉప్పు మిక్సీ పట్టింది), అర స్పూన్ మెంతులు, పావు కప్పు పొట్టు వలచిన వెల్లులి రెబ్బలు.
చేసే విధానం:
ఒక కేజీ మామిడికాయలు చిన్నవిగా పుల్లగా ఉండేలా తీసుకోవాలి. చిన్నవి గా ఉంటే టెంక అన్ని ముక్కలకి వస్తుంది . పండువి ,టెంక లేని ముక్కలని ఏరేసి ఒక కేజీకి సరిపడా ముక్కలు వచ్చేలా చూసుకోవాలి. టెంకకి ఉన్న తెల్ల పొర ని తీసేయండి. లేకపోతే తేమ ఉండి పచ్చడి పాడవుతుంది .
పొడి బట్టతో చక్కగా ముక్కలని శుభ్రం చేసుకోవాలి. ముక్కలకి ఉన్న తేమ ఆరటానికి కాసేపు పక్కన పెట్టండి. ఒక పొడి బాణలిలో ఆవాలను దోరగా వేయించి పక్కనపెట్టి... అదే బాణలిలో మెంతులు కూడా వేయించి పెట్టుకోవాలి.
చల్లారిన తర్వాత వీటిని విడివిడిగా మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకుని ఉంచుకోవాలి . నూనె కూడా పచ్చిదైనా లేదా వాసన ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేడి చేసి చల్లార్చినదైనా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఆరిన ముక్కలకు కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, అర స్పూన్ మెంతులు,పావు కప్పు పొట్టు వలచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో అన్నిటినీ కలుపుతూ నూనెని పోస్తూ అన్ని ముక్కలకి పట్టేలాగా కలపాలి. వాటిని శుభ్రమైన గాజు సీసా లేక జాడీలో కానీ పెట్టినట్లయితే రంగు రుచి మారకుండా సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటుంది.


