Tomato Munakkaya Curry : ట‌మాటా మున‌క్కాయ కూర‌ను ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

మ‌నం మున‌క్కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌ను ఎక్కువ‌గా సాంబార్ లో వేస్తూ ఉంటాము. అలాగే వీటితో ప‌చ్చ‌డి, కూర వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మున‌క్కాయ‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి.

కావలసిన పదార్దాలు
లేత మునక్కాయలు – 5
టమాట – 3
ఉల్లిపాయ – 1
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమిర – 2 రెమ్మలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1స్పూన్
పసుపు – చిటికెడు
కారం పొడి – 1 స్పూన్
గరం మసాలా పొడి – 1/2 స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 2 స్పూన్స్

తయారి విధానం
మునక్కాయల పై చెక్కు తీసి రెండు అంగుళాల ముక్కలుగా కోసుకోవాలి . బాణలి పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడి చేసి సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్ది సేపు వేగించాలి. ఇప్పుడు పసుపు, కరివేపాకు, అల్లం ,వెల్లుల్లి ముద్ద వేసి కొంచెం సేపు వేగించాలి.

ఆ తర్వాత కారం, మునగకాయ ముక్కలు, సరిపడ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ముక్కలు కాస్త మెత్తగా అయ్యాక, కోసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి కొంచెం వేగాక , ఒక కప్పు నీరు పోసి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి. నీరు మొత్తం అయ్యి పోయాక గరం మసాలా , కొత్తిమిర వేసి కలిపి దింపాలి. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి మంచి కాంబినేషన్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top