Tea time, snack time లో కరకరలాడే క్రిస్పీగా ఉండేవి పకోడి, చెక్కలు ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. అప్పుడు మనం ఈ చెక్కలు చేసుకుంటే నిల్వ ఉంచుకోవచ్చు. ఆఫర్ చేయడానికి బాగుంటాయి.
కావలసినవి:
పెసరపప్పు, పల్లీలు, బియ్యప్పిండి, ఉప్పు ,కారం ,పసుపు ,కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా.
చేసే విధానం.
పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక పావు కప్పు పల్లీలు కూడా కచ్చాపచ్చాగా దంచుకొని నానబెట్టుకోవాలి. నాన్న పెట్టడం వల్ల అవి బాగా పట్టి ఉంటాయి. నూనెలో విడిపోకుండా ఉంటాయి. ఒక వెడల్పాటి పళ్లెంలో మూడు కప్పుల బియ్యప్పిండి తీసుకోవాలి.
ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి paste, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ ,కొంచెం పసుపు పావు కప్పు నువ్వులు, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ,నానబెట్టి ఉంచుకున్న పల్లీలు , కొత్తిమీర పావు పావు కప్పు వెన్న , ఈ మిశ్రమాన్ని అంతా వెన్న తోటే బాగా పట్టించాలి.
కొంచెం వాటర్ కలుపుకుంటూ బాగా గట్టిగా స్మూత్ గా ఉండేలా కలుపుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా తడి బట్ట వేసి కప్పించుకోవాలి .చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒక పాలిథిన్ కవర్ కి ఆయిల్ గ్రీస్ చేసి దానికి సరిపడా చేసుకోవాలి. నూనె కాగేలోపు ఈ ఒత్తికున్న మసాలా వడలు ఒక తడి బట్ట మీద పెట్టుకొని, మూకిడికి సరిపడా నూనె వేసుకొని వేయించుకోవాలి. క్రిస్పీ క్రిస్పీ మసాలా వడలు రెడీ.


