కావలసినవి:
12 పచ్చిమిరప, నిమ్మకాయ అంత చింత పండు, ఒక కప్పు చిన్న కొబ్బరి ముక్కలు, ఒక్క స్పూన్ జీలకర్ర, ఒక కప్పు కరివేపాకు
పోపుకి కావలసినవి మినప గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు
చేసే విధానం
చింతపండుని ఒకసారి కడిగి నీళ్లలో నాన పెట్టుకోండి. పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చిని తెల్లగా వేయించుకోండి. అవి తీసి పక్కన పెట్టుకొని, ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని ఆ పాన్ లో వేసి వాటిని కూడా ఒకసారి కలుపుకోండి. కొద్దిగా కలర్ మారే వరకు ఉంచి జీలకర్ర కలిపి ఒక్క నిమిషం వేగనిచ్చి తీసేయండి.
ఒక స్పూను ఆయిల్ వేసి ఒక కప్పు కరివేపాకు కూడా క్రిస్పీగా వేగించుకోండి. ఇది చల్లారే లోపు పోపు పెట్టుకోండి.
పోపుకి - ఒక స్పూను మినప గుళ్ళు, స్పూను శనగపప్పు, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర , ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలు లేదా దంచి పోపు పెట్టుకోండి.
ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు మాత్రమే నీళ్లు కాకుండా, ఉప్పు వేసి ఒక పల్స్ తిప్పండి. తర్వాత వేయించిన కొబ్బరి ముక్కలు, జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసుకోండి.
అవసరానికి చింతపండు నీళ్లు మాత్రం కలుపుకోండి. ఇది రైస్ లోకి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. చట్నీలోకి అవసరమైతే కొంచెం జారుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించిన పోపుని చట్నీ లో వేసి కలిపేయండి. అంతేనండి గ్రీన్ చట్నీ రెడీ.


