Chakkera pongali recipe:చక్కెర పొంగలి గుడి ప్రసాదం రుచి రావాలంటే ఇలా చేస్తే సరి

చక్కెర పొంగలి గుళ్లో ప్రసాదం లాగా టేస్టీగా ఉండాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి. త్వరగా చేయాలి అంటే ఈ రైస్ స్వీట్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఉంటుంది. కొబ్బరి ముక్కలు వేయడం వల్ల క్రంచీగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:

ముప్పావు కప్పు బియ్యం , పావు కప్పు పెసరపప్పు ,మొత్తం   బియ్యము  - పెసరపప్పు కలిపి ఒక కప్పు అవుతాయి .ఎక్కువ పెసరపప్పు వేసుకుంటే ముద్దగా అయిపోతుంది.  ఒక కప్పు పంచదార, పావు కప్పు బెల్లం, కొంచెం పచ్చ కర్పూరం,  జీడిపప్పు , కిస్మిస్ , కొబ్బరి చిన్న ముక్కలుగా చేసుకోండి, పావు కప్పు నెయ్యి.

చేసే విధానం:

ముందుగా బియ్యం -  పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి  కుక్కర్లో  ఒక కప్పు కి రెండు నీళ్ళు పోసి ఉడికించుకోండి. మామూలుగా రైస్ ఉడికించినట్టుగానే మూడు విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేయండి. ఇప్పుడు మూత తీసి ఆ రైస్ పొడిపొడిగా ఉంటుంది కదా అందులో ఒక కప్పు పంచదార , పావు కప్పు బెల్లం వేసి లో ఫ్లేమ్ లో అన్నము చితిపెయకుండా చాలా తేల్చి కలుపుకుంటూ ఉండాలి. 

ఆ వేడికి పంచదార కరిగి అన్నం జారుగా  ఉంటుంది. అందులో ఒక పావు కప్పు నెయ్యి తీసుకుని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ప్రసాదం ఎక్కువగా పంచదారతోనే చేస్తారు కాబట్టి చక్కెరతో ఇలా చేసుకోండి. కొంచెం పచ్చ కర్పూరం కలపాలి.  

దీనివల్ల గుళ్లో ప్రసాదం taste వస్తుంది,  కమ్మని వాసన వస్తుంది, ఎక్కువ సేపు పాడవకుండా ఉంటుంది. అంతలో  పాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసి అందులో చిన్న  కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోండి. ఈ కొబ్బరి ముక్కలు చాలా టేస్ట్ గా ఉంటాయి.  

ఎర్రగా దోరగా వచ్చేలా చూసుకోండి. తర్వాత జీడిపప్పు వేయండి,  అవి వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత  చక్కెర పొంగలి లో వేసి కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచండి. అంతేనండి అమ్మవారి ప్రసాదం తయారు అయిపోయింది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top