Pepper rice:నోటికి ఎమీ తినబుద్దికానప్పుడు కారకారంగా ఇలా చేస్కోండి సూపర్ టెస్టీగా ఉంటుంది

సాంబార్ రైస్ flavour లాగా ఈ పొడిని కలుపుకుంటూ రైస్ చేసుకుంటే కారం కారంగా టేస్ట్ గా ఉంటుంది. ఈ పౌడర్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు .ఎప్పుడంటే అప్పుడు రైస్ కి కలుపుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది.

కావలసినవి:

ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక్క టేబుల్ స్పూన్ మినప గుళ్ళు, రెండు మూడు ఎండు మిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  పాన్ లో నూనె లేకుండా మినప గుళ్ళు కలర్ చేంజ్ వచ్చేవరకు వేగనిచ్చి, స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని పొడి చేసి ఉంచుకోండి. ఈ పొడి స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. 

రెండు స్పూన్లు నెయ్యి, ఒక్క స్పూను జీలకర్ర , ఆవాలు,  అర స్పూన్ పచ్చనగపప్పులు, అర స్పూన్ మినప గుళ్ళు,  ఒక గుప్పెడు జీడిపప్పు ,కొంచెం పల్లీలు. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ.

చేసుకునే విధానం:

ఒక పాన్ లో రెండు స్పూన్ల నెయ్యి గాని నూనె గాని, నెయ్యి రుచిగా ఉంటుంది వేసి ఒక స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర , అర స్పూన్ పచ్చి శనగపప్పు ,అర స్పూను మినప గుళ్ళు వేసి వేయించండి. ఒక కప్పు జీడిపప్పు కూడా వేయించుకోవాలి. కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. 

వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి .ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ పౌడర్ ,చేసుకున్న పొడిని రెండు స్పూన్లు వేసి కలుపుకోండి. ఉడికించిన కప్పు రైస్ ని ఇందులో వేసి , ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం అన్నం అంతా చేతితో కలుపుకోండి .కారం కారంగా టేస్ట్ గా ఉంటుంది త్వరగా అయిపోతుంది .  ఇది చాలా తొందరగా చేసుకునే రెసిపీ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top