మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు బయట మార్కెట్ లో కూడా రకరకాల తీపి పదార్థాలు లభ్యమవుతుంటాయి. బయట దొరికే కొన్ని రకాల తీపి పదార్థాలను మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటిలో నెయ్యి మైసూర్ పాక్ ఒకటి.
కావలసిన పదార్దాలు
శనగపిండి - 2 కప్పులు
డాల్డా లేదా నెయ్యి - 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
తయారుచేసే విధానం
ముందుగా శనగపిండిని జల్లించి పక్కన పెట్టాలి. తర్వాత బాండి పొయ్యి మీద పెట్టి దానిలో కొద్దిగా డాల్డా లేదా నెయ్యి వేసి అడుగు అంటకుండా శనగపిండిని దోరగా వేగించాలి. మరొక గిన్నెలో పంచదార,కొద్దిగా నీరు పోసి తీగ పాకం వచ్చాక శనగపిండిని వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
దీనిని కలుపుతూ డాల్డా లేదా నెయ్యి పోయాలి. అయితే మాడకుండా చూసుకోవాలి. కొంతసేపటికి డాల్డా లేదా నెయ్యి తేలి పిండి గుల్లబారుతుంది. అప్పుడు ఒక పళ్ళెంలో పోసి బాగా పరచి ముక్కలుగా కోసుకోవాలి. అంతే మైసూరు పాక్ రెడీ అవుతుంది.


