Restaurant Style Egg Fried Rice:రెస్టారెంట్ స్టైల్ లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ తరిగి ఉంటే ఐదు నిమిషాల్లో చాలా సులభంగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం అలాగే కావాల్సిన పదార్థాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ ఫ్రైడ్ రైస్ కోసం బాస్మతి రైస్ లేదా సానా మసూరి రైస్ వాడవచ్చు.. లేదంటే అన్నం మిగిలిపోయిన సరే ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో ఈ ఫ్రైడ్ రైస్ ని చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు.
కావలసిన పదార్థాలు
ఒక కప్పు బాస్మతి రైస్ పొడిపొడిగా వండాలి
అరకప్పు సన్నని క్యారెట్ తరుగు
పావు కప్పు సన్నని ఫ్రెంచ్ బీన్స్ తరుగు
అర స్పూన్ లైట్ సోయాసాస్
అర స్పూన్ వెనిగర్
అర స్పూన్ వైట్ పెప్పర్ పొడి
అర స్పూన్ మిరియాల పొడి
అర స్పూన్ పంచదార
పావు స్పూన్ ఆరోమెటిక్ పౌడర్
పావు స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు
మూడు స్పూన్ల నూనె
తయారీ విధానం
పొయ్యి వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసి గుడ్లను బాగా బీట్ చేసి వేయాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి 60 శాతం వేగించాలి. ఆ తర్వాత లైట్ సోయాసాస్, వెనిగర్, ఉప్పు, ఆరోమెటిక్ పౌడర్, వైట్ పెప్పర్ పొడి, మిరియాల పొడి, పంచదార,స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి బాగా కలపాలి. అంతే ఎంతో సులభంగా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.


