Foods Good For Brain Health:శరీరం ఆరోగ్యంగా,చురుకుగా ఉండటమే కాకుండా మెదడు కూడా ఆరోగ్యంగా,చురుకుగా ఉండవలసిన అవసరం ఉంది. శరీర ఆరోగ్యానికి,చురుకుదనానికి రకరకాల పద్దతులు అందుబాటులో ఉన్నట్టే,మెదడు ఆరోగ్యంగా ఉండటానికి కూడా అనేక పద్దతులు ఉన్నాయి.
ముఖ్యంగా ఒత్తిడి,ఆందోళన వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఇవి శారీరక ఆరోగ్యం మీదే కాకుండా మెదడు మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. పై రెండింటిని అదుపులో పెట్టుకోవటానికి యోగ,మెడిటేషన్ వంటివి సాదన చేయాలి. రోజులో కొంత సమయం వీటికి కేటాయించాలి.
పజిల్స్,మైండ్ గేమ్స్ ఎక్కువుగా ఆడటం ద్వారా కూడా మెదడును చురుకుగా ఉంచుకోవచ్చు. అయితే ఎప్పుడు ఒకే రకమైన వాటిని ఆడకుండా తరచూ మారుస్తూ ఉండాలి. అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
మెదడు ఆరోగ్యంగా ఉండటానికి మార్కెట్ లో కొన్ని మందులు లభ్యం అవుతున్నాయి. అయితే వాటి వలన మేలు కన్నా హాని ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
వ్యాయామం శరీరాన్నే కాకుండా మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. వ్యాయామంలో భాగంగా తోటపని వంటివి చేసినట్టైతే మంచి పలితం కనపడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచటానికే కాకుండా మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచే శక్తి చేపకు ఉంది. దీనిలో ఉండే ఒమేగా 3,ప్యాటి ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరచటానికి దోహదం చేస్తాయి. చేపను ఆహారంలో తీసుకోవటం వలన ఆందోళన,ఒత్తిడి తగ్గి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
మెదడును చురుకుగా ఉంచే శక్తి కాఫీకి ఉంది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెప్పుతున్నారు.
అధిక బరువు శరీరాన్నే కాకుండా మెదడును కూడా మొద్దుబారెల చేస్తుంది. అందువలన బరువు తప్పనిసరిగా తగ్గించుకోవాలి. అయితే ఆరోగ్యకరమైన పద్దతుల ద్వారా మాత్రమే అధిక బరువు నియంత్రించుకోవాలి. త్వరగా బరువు తగ్గాలనే ఆలోచనతో అనారోగ్య పద్దతులను అనుసరించకూడదు. తీపి పదార్దాలు చాలా తక్కువగా తీసుకోవాలి.
అన్నింటికన్నా మంచి సానుకూల దృక్పదం. ఇది శరీరాన్నే కాదు మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది.


