Babycorn capsicum curry recipe:రైస్, రోటి, చపాతీ, నాన్.. ఇలా దేనిలోకైనా అదిరిపోయే బేబీ కార్న్ కర్రీ.. ఈ విధంగా చేస్తే చాలా తొందరగా మంచి రుచితో వస్తుంది.
కావలసిన పదార్దాలు
బేబీకార్న్ - 10,
క్యాప్సికమ్ - 2
టమాటాలు - 2,
ఉల్లిపాయలు - 2
జీలకర్ర - అర స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
కారం - 1 స్పూన్,
జీడిపప్పు - 10
ధనియాల పొడి - 1 టీ స్పూన్
గరంమసాలా - అర టీ స్పూన్
మెంతి ఆకు - కొద్దిగా,
పాలమీగడ - 2 టీ స్పూన్లు
పసుపు - పావు టీ స్పూన్,
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నూనె - 1 టేబుల్ స్పూన్,
ఉప్పు - తగినంత
తయారీ విధానం
క్యాప్సికమ్, బేబీకార్న్, టమోటా, ఉల్లిపాయలు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. జీడిపప్పును కొద్దిసేపు వేడి నీళ్లలో నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి.
పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక జీలకర్ర, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేయాలి.
రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు బేబీకార్న్, క్యాప్సికమ్ ముక్కలు వేసి అరకప్పు నీళ్లు పొయ్యాలి.
పది నిమిషాల తర్వాత జీడిపప్పు పేస్ట్, మెంతి ఆకు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. దీనిని దించటానికి ముందు పాలమీగడ, కొత్తిమీర వేసుకుంటే బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇది పరోటాలకు మంచి కాంబినేషన్.