Bitter Gourd Benefits:చేదుగా ఉంటుందని లైట్ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే మాత్రం... కాకరకాయ అనగానే చాలామంది అసలు ఇష్టపడరు. దాని చేదు రుచి వల్ల చాలా మంది తినడానికి ఆసక్తి చూపరు. కానీ కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు తెలిసినప్పుడు వారు దానిని వదలరు.
నిపుణులు కాకరకాయను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని సిఫారసు చేస్తారు. చేదు ఉన్నప్పటికీ ఇందులో ఫైబర్, పొటాషియం, మాంగనీస్, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి, ఇవి శరీరానికి అత్యవసరం. మరి మితంగా కాకరకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
బరువు తగ్గడానికి కాకరను మితంగా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణుల సలహా. దీనిలో ఉండే తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ బాగా సాగేలా చేసి బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
షుగర్ రోగులకు కాకర తీసుకోవడం మంచిదని.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ స్రావాన్ని పెంచే సమ్మేళనాలతో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగలదు.
కాకరకాయను కూర రూపంలో కాకుండా జ్యూస్ రూపంలో తాగినప్పుడు అది మరింత ప్రయోజనకరం. మితంగా కాకరకాయ జ్యూస్‌ను సేవిస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. దీని వలన రక్త ప్రసరణ మెరుగుపడి,గుండె పోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.
కాకరకాయ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు ప్రసిద్ధిగాంచింది. దీన్ని మితంగా వాడటం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించగలవు. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల నుండి జాగ్రత్తగా ఉండడానికి ఇది సహాయపడుతుంది.