Red Chilli:కారం ఎక్కువగా తింటున్నారా...శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా..?

1 minute read
Red Chilli Powder
Red Chilli Side Effects:కారం ఎక్కువగా తింటున్నారా... శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా.. ప్రతి వంటకంలో కారం తప్పనిసరి అని చెప్పవచ్చు. కారం లేని వంటకం ఊహించలేము. కొందరు మరీ ఎక్కువ కారం తినడం ఇష్టపడతారు.

హోటల్లో కూడా స్పైసీ ఆహారం కోరుకుంటారు. అయితే నిపుణులు కారం అధికంగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో కారం ఎక్కువ తినడం వల్ల శరీరంపై ఏర్పడే మార్పులు గురించి ఇప్పుడు చూద్దాం.

అధిక మోతాదులో కారం తినడం గుండె ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. కారం యొక్క కొన్ని లక్షణాలు రక్తనాళాలను సంకోచించడానికి కారణమవుతాయి, దీని ఫలితంగా రక్తపోటు పెరగవచ్చు. ఇది గుండెపోటు సమస్యలకు మార్గం కల్పించవచ్చు.

కారం అధికంగా తినడం వల్ల అల్సర్‌ వంటి ప్రధాన సమస్యలు ఏర్పడవచ్చు. అల్సర్‌ వల్ల పొట్టలో పుండ్లు ఏర్పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

నిపుణులు చెప్పిన దాని ప్రకారం, జీర్ణ సమస్యలకు కారం అధికంగా తినడం ఒక కారణం. అధిక కారం వల్ల కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు మరియు విరేచనాలు, వాంతులు కూడా రావచ్చు.

అలాగే కారం అధికంగా తినడం వల్ల చర్మ సమస్యలు కూడా రావచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. దురద, చర్మం ఎర్రబడడం వంటి సమస్యలు వారిలో కనిపించవచ్చు.

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top