Green Peas Health Benefits:పచ్చి బఠానీలను ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయి. పచ్చి బఠానీలు ఫైబర్, స్టార్చ్, ప్రొటీన్లు, మరియు విటమిన్లు వంటి పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి.
శాఖాహారులకు ప్రోటీన్‌కు మంచి మూలంగా పచ్చి బఠానీలు ఉపయోగపడతాయి. మితంగా పచ్చి బఠానీలను తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య నుండి బయట పడవచ్చు. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. పచ్చి బఠానీలలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి పచ్చి బఠానీలు మంచివి. వీటిలో పాలీఫెనాల్స్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పొటాషియం, మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పొటాషియం రక్తపోటు నియంత్రణలో కీలకం. అలాగే ఫ్లేవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
100 గ్రాముల పచ్చి బఠానీలో 81 కేలరీలు ఉండటం వలన.. ఇవి కేలరీలు తక్కువ ఉండే ఆహారంగా పరిగణించబడతాయి. ప్రోటీన్‌లు మరియు ఫైబర్‌లు అధికంగా ఉండడం వలన.. ఇవి బరువు నియంత్రణలో ఉపయోగపడతాయి. తినాలనే కోరికను తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పచ్చి బఠానీలను చేర్చుకోవడం మంచిది.
100 గ్రాముల పచ్చి బఠానీలలో 2480 మైక్రోగ్రాముల ల్యూటిన్ మరియు జియాక్సంతిన్ ఉండటం వల్ల.. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా కళ్ళకు కలిగే హానిని నివారిస్తాయి. ఇవి వయసుతో సంబంధించిన మచ్చల సమస్యను తగ్గించడంలో అలాగే కంటి శుక్లాన్ని కూడా తగ్గిస్తాయి.
పచ్చి బఠానీలు ప్రొటీన్లకు మంచి మూలం. 2023 జర్నల్ ఒబేసిటీ ప్రచురణలో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రొటీన్ సమృద్ధి ఆహారాలను సేవించడం టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరపరచడంలో సహాయపడుతుంది.