Home Remedy For Neck Darkness : ఇలా చేస్తే మెడ మీద నలుపు 5 నిమిషాల్లో మాయం..చర్మ సంరక్షణలో అనేక మంది తమ ముఖం మరియు శరీరంపై ఉన్న చర్మాన్ని సురక్షితంగా, అందంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు.
అయితే మెడ భాగం పట్ల అవగాహన లేకపోవడం వల్ల అక్కడ నలుపు రంగు ఏర్పడుతుంది. మిగిలిన శరీర భాగాలు తెల్లగా ఉన్నా కూడా కేవలం మెడ భాగంలో మాత్రమే కొంతమందిలో నలుపు రంగు ఏర్పడుతుంది.
ప్రాచీన ఈజిప్టు వాసులు అందం కోసం కలబందను ఉపయోగించేవారు. కలబంద గుజ్జులో ఉండే విటమిన్లు, ఎంజైమ్స్, మినరల్స్ మన చర్మానికి మంచిది. అవి చర్మాన్ని మెరుగుపరచి కాంతివంత మైనదిగా మార్చి మృదుత్వం ఇస్తాయి. కలబంద చర్మాన్ని చల్లబరచడంలో కూడా సహాయపడుతుంది.
కలబంద గుజ్జులో యాంటీ-ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉండటం వల్ల దాన్ని చర్మంపై రాసుకుంటే వాపులు తగ్గుతాయి. సూర్యరశ్మి వల్ల కాలిపోయిన చర్మం కూడా మళ్ళీ సహజ స్థితికి వస్తుంది. ముఖంపై హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. మెడపై ఉండే నలుపు దనం తొలగించడంలో కలబంద గుజ్జు చాలా ప్రభావశీలంగా పనిచేస్తుంది.
కాఫీ గింజలు కెఫీన్ మరియు యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతమైనదిగా మారుతుంది. అలాగే చక్కెర కూడా చర్మంపై మృతకణాలను తొలగించి మెరుపు తీసుకురావటంలో సహాయపడుతుంది.
పసుపు చర్మ సంరక్షణలో చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. ఇది చర్మానికి అందం ఇవ్వడంతో పాటు నలుపు దనాన్ని కూడా తొలగిస్తుంది. ఈ పదార్థాలను కలిపి ఒక మిశ్రమం తయారు చేసి దాన్ని మెడపై వాడితే నలుపు దనం త్వరగా పోయి చర్మం మరింత అందంగా మారుతుంది.
2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, 1 టేబుల్ స్పూన్ చక్కెర పొడి, మరియు 1 టీస్పూన్ పసుపు తీసుకొని.. వీటిని బాగా కలిపి మెత్తటి పేస్ట్‌గా చేయాలి. అవసరమైతే కొంచెం నీరు కలపవచ్చు. దీనిని చేసిన తరువాత, మెడను సబ్బుతో కడిగి శుభ్రపరచాలి.
టవల్‌తో తడిని తుడవాలి. తరువాత ముందుగా సిద్ధపరచిన మిశ్రమాన్ని మెడపై వృత్తాకారంగా టచ్ చేస్తూ రాయాలి. ఈ మిశ్రమం మెడపై 5-10 నిమిషాలు ఉంచాలి. మెడపై నల్లని ప్రదేశాన్ని మొత్తం కవర్ చేసేలా మిశ్రమాన్ని అప్లై చేయాలి.
ఈ ప్రక్రియను 15 నుంచి 20 నిమిషాల పాటు వేచి ఉంచి, ఆ తర్వాత కడిగేయాలి. వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ ప్రక్రియ అనుసరించడం ద్వారా మెడపై నలుపు తొలగించవచ్చు, దీనివల్ల మీ మెడ మీ ముఖంలా అందంగా మరియు కాంతివంతంగా ఉంటుంది. అయితే, బయటకు వెళ్లే సమయంలో మెడపై సన్‌స్క్రీన్ లోషన్ రాయడం మంచిది.