కావలసిన పదార్దాలు
టొమోటోలు.. నాలుగు
ఉల్లిపాయలు.. రెండు
పచ్చిమిర్చి.. నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.
నూనె.. తగినంత
బ్రెడ్ స్లైసులు.. నాలుగు
ఉప్పు.. తగినంత
జీలకర్ర.. 2 టీ.
పుదీనా.. అర కప్పు
కొత్తిమీర.. అర కప్పు
కార్న్‌ఫ్లోర్.. అర కప్పు
తయారీ విధానం
ఒక బౌల్‌లో బ్రెడ్ స్లైసులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి.దానిలోనే ఉల్లిపాయ ముక్కలు,టమోటా ముక్కలు, పుదినా, కొత్తిమీర పేస్ట్, ఒకస్పూన్ నూనె, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పక్కన పెట్టాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడలు మాదిరిగా వత్తి, వాటిని కార్న్‌ఫ్లోర్‌లో అద్ది ఒకప్లేటులో పెట్టుకోవాలి.
ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక పైన తయారుచేసుకున్న వడలను గోల్డ్ కలర్ వెచ్చే వరకు వేగించాలి. ఈ విధంగా తయారైన టొమోటో కట్‌లెట్స్ ను సర్వింగ్ ప్లేట్ లో తీసుకోని ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర తో గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడిగా టొమోటో కట్‌లెట్స్ రెడీ.