Benefits Of Tamarind:చింతపండుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. పులుపు,తీపి కలిసిన చింతపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మరియు అనేక ఔషద గుణాలుఉన్నాయి. దీనిలో శరీరానికి మేలు చేసే ఖనిజాలు, విటమిన్స్,పీచు అధిక మొత్తంలో లభిస్తాయి.
అందువల్ల దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వంద గ్రాముల చింతపండు గుజ్జులో సుమారు పదమూడు శాతం పీచు లభిస్తుంది. పీచు అధికంగా ఉండుట వాలన మలబద్దకం నివారించటంలో బాగా పనిచేస్తుంది. అలాగే చింతపండు శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటానికి సహాయ పడుతుంది. క్యాన్సర్ కణాలను నిరోదిస్తుంది.
శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. చింతపండులో టార్టారిక్ ఆమ్లం అధిక మొత్తంలో ఉండుట వలన చక్కని రుచిని ఇవ్వటమే కాకుండా, శక్తివంతమైన యాంటి ఆక్సి డెంట్ గా పనిచేస్తుంది. తద్వారా శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని బయటకు పంపటానికి సహాయపడుతుంది.
చింతపండులో కాపర్,పొటాషియం,క్యాలిష్యం, ఐరన్, సెలీనియం, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. పొటాషియం గుండె స్పందనను సమన్వయపరచి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఇనుము శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాకుండా దీనిలో చాలా కీలకమైన విటమిన్స్ ఉన్నాయి. దీనిలో ఉండే ఫోలిక్ ఆమ్లం, నియామిన్, విటమిన్ సి లు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంచటానికి సహాయపడతాయి. అంతేకాక ఎముకలను దృడంగా ఉంచుతాయి.