Gas Burner Clening Tips:ప్రతి ఇంటిలో గ్యాస్ స్టౌ వాడకం సాధారణం. గ్యాస్ స్టౌ బర్నర్లు సరిగ్గా ఉంటేనే వంట త్వరగా చేయవచ్చు. వీటిని ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ చూడండి.
కొత్త వస్తువులను మనం మరకలు పడకుండా జాగ్రత్తగా ఉంచుతాం. కాలక్రమేణా వాటిని అదే స్థితిలో ఉంచలేము. గ్యాస్ స్టౌ బర్నర్లు కూడా అలాంటివే, తరచుగా వాడటం వల్ల అవి మసిబారుతాయి.
బర్నర్స్ నుంచి మంట తగినంత రాకపోవడంతో వంట ఆలస్యం అవుతుంది. బర్నర్స్‌ని కొత్తవిలా మెరిపించి, మంట సరిగా రావాలంటే కొన్ని సులభమైన టిప్స్‌ని అనుసరించాలి. ఈ టిప్స్‌ని పాటిస్తే బర్నర్స్‌పై ఉన్న పాల మరకలు, నూనె మరకలు తొలగిపోయి అవి కొత్తవిగా మారతాయి.అలాగే మంట కూడా బాగా వస్తుంది. ఆ టిప్స్ ఏమిటో ఇక్కడ చూడండి.
మొదట ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి వేడిగా ఉన్న ఆ నీటిని బర్నర్లను శుభ్రపరచడానికి ఉపయోగించండి. ఈ ప్రక్రియతో నూనె మరియు జిడ్డు మరకలు తొలగిపోయి బర్నర్లు మెరుగుపడతాయి.
ఒక కప్పు వేడి నీరులో డిష్‌వాష్ లిక్విడ్ కలపండి. ఆ నీటిలో బర్నర్స్‌ని 5 నుండి 10 నిమిషాలు ఉంచండి. అనంతరం స్పాంజ్‌తో వాటిని తుడిచి శుభ్రపరచండి. చివరగా వాటిని నీటితో కడిగి తుడవండి.
బర్నర్స్‌ని స్వల్పంగా వేడి చేసి నిమ్మరసంతో రుద్దండి. కొంత సమయం ఆగి తర్వాత డిష్‌వాష్ లిక్విడ్‌తో తుడిచి శుభ్రపరచండి.
నీటిలో ఉప్పు వేసి బర్నర్స్‌ని కూడా అందులో ఉంచి మరిగించండి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత వాడని టూత్‌బ్రష్‌ని డిష్‌వాష్‌లో ముంచి మరకలున్న చోట తుడిచేయండి. ఇలా చేస్తే మరకలు పోయి బర్నర్స్ కొత్తవిగా మెరుస్తాయి.
ఈ చిట్కాలను మీరు ఎంచుకుని నెలకు ఒకసారి అయినా పాటిస్తే, బర్నర్స్‌పై పడిన మరకలు తొలగిపోయి తెల్లగా మెరుస్తాయి. అలాగే మంట కూడా బాగా వస్తుంది, దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది.