Amla benefits For Hair:జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారా? ఉసిరితో అన్నీ క్లియర్.. వగరు రుచిలో ఉండే ఉసిరి మన జుట్టుకి ఎంత మేలు చేస్తుందో తెలుసా? మన జుట్టుకు ఉసిరి చాలా మేలు చేస్తుంది.
దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అది వెంట్రుకుల కుదుళ్ళను దృడంగా ఉంచటానికి, జుట్టు ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు తెల్లపడకుండా కాపాడుతుంది.
ఉసిరికాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొన్ని కుంకుడు కాయలు,కొన్ని శికాయలు కలిపి నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమంతో మాడును,తల వెంట్రుకలను శుభ్రం చేసుకొంటే మురికి మొత్తం పోతుంది. దీనిని షాంపూ గా వాడుకోవచ్చు.
ఉసిరిపొడికి కొంచెం నిమ్మరసం కలిపి... దాన్ని మాడుకు రాసుకోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు గట్టి పడతాయి. అలాగే జుట్టు రాలటం తగ్గి నిగనిగలాడుతుంది. ఉసిరి రసాన్ని హేన్నాలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది.