Yellow Teeth:మీ పళ్లు తెల్లగా ముత్యంలా మెరవాలంటే .. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. ముఖానికి నవ్వే అందం. ఆ నవ్వు బాగుండాలంటే పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉండాలి. పళ్ళు తెల్లగా మిలమిలలడాలంటే కొంత శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి.
మీరు అరటిపండు తిన్నాక తొక్కను పారేస్తున్నారా? అరటిపండు తొక్కతో మీ పళ్ళను తెల్లగా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆ తొక్కతో మీ పళ్ళ మీద ఒక నిమిషం బాగా రుద్దాలి. ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేస్తూ ఉంటే కొన్ని రోజులకు మీ పళ్ళు తెల్లగా మెరుస్తాయి.
అరటితోక్కలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనిస్ వంటి మూలకాలు, పళ్ళను రుద్దేటప్పుడు పళ్ళలోకి ఇంకి మెరుస్తూ ఉంటాయి. అలాగే నారింజ తొక్కతో కూడా ఈ విధంగా చేయవచ్చు. మంచి రంగులో ఉండే స్ట్రా బెర్రీ లు కూడా పళ్ళను శుభ్ర పరుస్తాయి.
దీని కోసం బాగా పండిన స్ట్రా బెర్రీ లను తీసుకోని పేస్ట్ చేసి పళ్లకు రాసుకోవాలి. మూడు నిమిషాల తర్వాత పళ్ళను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. స్ట్రా బెర్రీ లో ఉండే మాలిక్ ఆమ్లం పళ్ళను తెల్లగా చేస్తుంది.
క్యారట్ లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. వాటిని వండకుండా పచ్చిగా తింటేనే మంచిది. పళ్ళపై వచ్చిన గీతలను తగ్గిస్తుంది.