బీన్స్ ఫ్రై
కావాల్సిన పదార్థాలు:
- చిన్నగా తరిగిన బీన్స్ - 250 గ్రాములు
- పసుపు - 1/4 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నీళ్లు - 1/4 కప్పు
- నానబెట్టిన శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- ఎండుమిర్చి - 6
- జీలకర్ర - 1 టీస్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- తాళింపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- పచ్చికొబ్బరి తురుము - 1/4 కప్పు
- తరిగిన కొత్తమీర - కొద్దిగా
తయారీ విధానం:
1. ముందుగా మిక్సీ జార్‌లో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేయాలి.
2. కడాయిని స్టవ్ మీద పెట్టి, తరిగిన బీన్స్, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. తర్వాత 1/4 కప్పు నీళ్లు పోసి, మూత పెట్టి బీన్స్ మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి.
4. మూత తీసి, నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు బీన్స్‌ను వేయించి, పక్కన పెట్టుకోవాలి.
5. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
6. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
7. తర్వాత గ్రైండ్ చేసిన శనగపప్పు మిశ్రమం వేసి, ఉడికించిన బీన్స్ కూడా జోడించి బాగా కలిపి వేయించాలి.
8. మూత పెట్టి మరో 2 నిమిషాలు తక్కువ మంటపై వేయించాలి.
9. చివరగా పచ్చికొబ్బరి తురుము, తరిగిన కొత్తమీర వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ విధంగా చేస్తే రుచికరమైన బీన్స్ ఫ్రై సిద్ధమవుతుంది!