Kaju Paneer Curry:కాజు పన్నీర్ మసాలా ఇలా చెయ్యండి రైస్ చపాతీ దేనిలోకినా అదిరిపోద్ది..
కావాల్సిన పదార్థాలు:
- టమాటాలు - 2 (పెద్దవి)
- జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- దాల్చిన చెక్క - 1 ఇంచు
- లవంగాలు - 3
- యాలకులు - 2
- జీలకర్ర - అర టీస్పూన్
- ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - అర టీస్పూన్
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కారం - 1½ టీస్పూన్
- గరం మసాలా - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
- నీళ్లు - అర కప్పు
- పనీర్ - 250 గ్రాములు
- వేయించిన జీడిపప్పు - ¼ కప్పు
- బటర్ - 2 టేబుల్ స్పూన్లు
- కసూరి మెంతి - 1 టీస్పూన్
- కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
తయారీ విధానం:
1. జార్‌లో టమాటాలు, జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
2. బాణలిలో నూనె వేసి వేడి చేసి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి వేయించాలి.
3. ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
5. ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
6. ఒక నిమిషం వేయించిన తర్వాత, గ్రైండ్ చేసిన టమాటా-జీడిపప్పు మిశ్రమం వేసి, మూత పెట్టి నీళ్లు పోసి కలపాలి.
7. పనీర్ ముక్కలు, వేయించిన జీడిపప్పు, బటర్ వేసి కలుపుకోవాలి.
8. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
9. చివరగా కసూరి మెంతి, తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే రుచికరమైన కాజు పనీర్ కర్రీ సిద్ధం!