Quinoa:సెలబ్రిటీలు ఇష్టపడే సూపర్ ఫుడ్ కినోవా.. దీని అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే..ప్రస్తుతం చాలా మంది తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడే అనేక ఆహారాలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ఆహారాలు సూపర్ ఫుడ్‌గా ప్రసిద్ధి చెందాయి.
అలాంటి వాటిలో కినోవా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దీనిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అనేక మంది సెలబ్రిటీలు కినోవాను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. ఇది అనేక పోషకాలను అందిస్తూ, ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది మరియు వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. వైద్యులు మరియు పోషకాహార నిపుణులు కినోవాను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు.
బరువు తగ్గడానికి సహాయం కినోవాలో వృక్ష సంబంధిత ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన 9 రకాల అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. నాన్-వెజ్ తినని వారికి కినోవా అద్భుతమైన ఆహార ఎంపిక. ఇది తినడం ద్వారా ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. నాన్-వెజ్ ఎక్కువగా తినేవారు కూడా కినోవాకు మారితే, మాంసం వల్ల కలిగే దుష్ప్రభావాలను తప్పించుకుని, అధిక ప్రోటీన్లను పొందవచ్చు.
అదనంగా, కినోవాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. కినోవాలోని ప్రోటీన్లు మరియు ఫైబర్ కారణంగా, దీనిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి ఎక్కువసేపు అనిపించదు. దీనివల్ల తక్కువ ఆహారం తినడం జరుగుతుంది, ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి డయాబెటిస్ ఉన్నవారికి కినోవా ఎంతో ప్రయోజనకరం. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా, దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోజూ కినోవాను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
కినోవాలో మాంగనీస్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి, ఇవి జీవక్రియను (మెటబాలిజం) మెరుగుపరుస్తాయి, కేలరీలను ఖర్చు చేసి కొవ్వును కరిగిస్తాయి. ఇందులోని మెగ్నీషియం కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది షుగర్ మరియు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, కినోవాలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించి, రక్తం తయారీకి తోడ్పడుతుంది.
వంట విధానం కినోవాలోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్వర్సెటిన్, కాంప్‌ఫెరాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి, కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి కినోవా గొప్ప ఎంపిక, ఎందుకంటే ఇందులో గ్లూటెన్ ఉండదు. కాబట్టి, గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు ఎలాంటి ఆందోళన లేకుండా కినోవాను తినవచ్చు.
కినోవాను వండడం ఎలాగో చాలా మందికి సందేహం ఉంటుంది. కినోవాను ఉప్మా లేదా అన్నం లాగా వండుకోవచ్చు. వండే ముందు కినోవాను 1-2 గంటలు నీటిలో నానబెడితే సులభంగా ఉడుకుతుంది. దీనిని శుభ్రంగా కడిగి, ఒక భాగం కినోవాకు రెండు భాగాల నీరు ఉపయోగించి వండాలి.
కినోవాను సైడ్ డిష్‌గా లేదా ప్రధాన ఆహారంగా తినవచ్చు. సలాడ్‌లలో కలిపి తినడం కూడా మంచి ఎంపిక. ఉదయం లేదా మధ్యాహ్నం కినోవాను తినడం ఉత్తమం. ఇలా కినోవాను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.