Drinking water:రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలా? వయసు వారీగా ఎంత నీరు తాగాలి..శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నీరు తాగడం చాలా అవసరం. అయితే, అందరికీ ఒకే మొత్తంలో నీరు అవసరమని చెప్పలేము. ఇది వయసు, జీవనశైలి, వాతావరణం, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఎంత నీరు తాగాలి?
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. కానీ, ఆరోగ్య సమస్యలను నివారించడానికి మరియు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని సాధారణంగా చెబుతారు. నిజంగా అందరూ 8 గ్లాసుల నీరు తాగాలా? నిపుణులు ఈ విషయంలో ఏమంటున్నారో తెలుసుకుందాం.
వయసు వారీగా నీటి అవసరం:
పిల్లలు (4–13 సంవత్సరాలు):
రోజుకు 1.2 నుండి 2.6 లీటర్ల నీరు అవసరం.ఆటలు ఆడితే లేదా ఎండలో ఎక్కువ సమయం గడిపితే నీటి అవసరం పెరుగుతుంది.తక్కువ నీరు తాగితే చిరాకు, తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు.వాటర్‌మెలన్, దోసకాయ, కమలాపండు వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు కూడా దాహాన్ని తీర్చడంలో సహాయపడతాయి.
టీనేజర్లు (14–18 సంవత్సరాలు):
ఈ వయసులో శరీర ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి అవసరం కూడా ఎక్కువ.అబ్బాయిలు: రోజుకు 3.3 లీటర్లు.అమ్మాయిలు: రోజుకు 2.3 లీటర్లు.హార్మోన్ల మార్పులు, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడిని సమతుల్యం చేయడానికి నీరు తాగడం ముఖ్యం.
మహిళలు:
సాధారణంగా రోజుకు 2.1 లీటర్ల నీరు అవసరం.వ్యాయామం, వేడి వాతావరణం, లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే నీటి అవసరం పెరుగుతుంది.నీటి కొరత వల్ల అలసట, శరీర ఉబ్బరం, తీపి తినాలనే కోరికలు కలుగుతాయి.మూత్రం లేత పసుపు రంగులో ఉంటే మీరు బాగా హైడ్రేటెడ్‌గా ఉన్నట్లు సూచిస్తుంది.
పురుషులు:
సాధారణంగా రోజుకు 3 లీటర్ల నీరు అవసరం.జిమ్‌కు వెళ్లడం లేదా వేడి వాతావరణంలో పని చేస్తే ఎక్కువ నీరు తాగాలి.నీరు తక్కువగా తాగితే పెదవులు పొడిబారడం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గర్భిణీ స్త్రీలు & పాలిచ్చే తల్లులు:
గర్భిణీ స్త్రీలు: రోజుకు సుమారు 2.4 లీటర్లు.
పాలిచ్చే తల్లులు: రోజుకు సుమారు 3 లీటర్లు.నీరు పాల ఉత్పత్తిలో, శరీరానికి పోషకాల సరఫరాలో, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎంత నీరు తాగాలో ఎలా తెలుసుకోవాలి?
శరీరం తన నీటి అవసరాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుంది:
మూత్రం రంగు: లేత పసుపు రంగులో ఉంటే మీరు హైడ్రేటెడ్‌గా ఉన్నారు. గాఢమైన రంగు ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని అర్థం.
దాహం: ఎప్పుడూ దాహం అనిపించకపోతే, మీరు తగినంత నీరు తాగుతున్నారని అర్థం.
లక్షణాలు: తలనొప్పి, చర్మం పొడిబారడం, మూత్రం సరిగా రాకపోవడం వంటివి నీరు తక్కువగా తాగడం వల్ల వచ్చే సంకేతాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీరు తాగండి.
సరైన మోతాదులో నీరు తాగడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


