Chitti Pesarattu:కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు హోటల్ స్టైల్ లో ఇంట్లోనే చేసేయండి.. పెసరట్టు అందరూ ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్. సాధారణంగా చేసే విధానం కాకుండా, ఒకసారి కాకినాడ స్టైల్ చిట్టి పెసరట్టు ట్రై చేస్తే... వామ్మో! సూపర్ టేస్ట్. ఇంట్లో తయారు చేసి పెడితే పిల్లలు, పెద్దలు వావ్ అని మెచ్చుకుంటారు. మరి ఈ రుచికరమైన రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం!
కావాల్సిన పదార్థాలు:
- పొట్టు పెసరపప్పు - 3 కప్పులు
- అల్లం - 2 చిన్న ముక్కలు
- పచ్చిమిర్చి - 10
- పసుపు - 2 టీస్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- ఉల్లిపాయలు - 2
- జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా 3 కప్పుల పొట్టు పెసరపప్పును ఒకసారి బాగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి.మరుసటి రోజు ఉదయం నానిన పప్పును చేత్తో ఆరబెట్టుతూ పొట్టు పూర్తిగా తీసేయండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి.
ఇందులోంచి కొద్దిగా పప్పు తీసి ప్రత్యేకంగా ఉంచండి.మిక్సీ జార్‌లో నానిన పెసరపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, 2 టీస్పూన్ల పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మీడియం కన్సిస్టెన్సీలో (గట్టిగా కాకుండా, లూజ్‌గా కాకుండా) పిండి కలపండి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి.
స్పెషల్ కారం పొడి కోసం కావాల్సినవి:
- నూనె - కొద్దిగా
- జీలకర్ర - ½ కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- చింతపండు - కొద్దిగా
- ధనియాలు - 2 కప్పులు
- ఎండుమిర్చి - 15
- కరివేపాకు - కొద్దిగా
- వెల్లుల్లి - 2 రెబ్బలు
కారం పొడి తయారీ:
పాన్‌లో కొద్దిగా నూనె వేడక్కించి, 15 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి పక్కన తీసుకోండి.అదే పాన్‌లో 2 కప్పుల ధనియాలు, ½ కప్పు జీలకర్ర వేసి దోరగా వేయించండి. ధనియాలు సగం వేగాక కరివేపాకు వేసి ఫ్రై చేసి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
మిక్సీలో ముందు ఎండుమిర్చి గ్రైండ్ చేసి, తర్వాత ధనియాలు-జీలకర్ర మిశ్రమం, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పొడిగా చేసుకోండి.
ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి, అందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు (పక్కనుంచినవి) కలిపి రెడీ చేసుకోండి.
పాన్ వేడక్కాక కొద్దిగా నూనె రాయండి. గరిటెతో పిండి తీసుకొని మందంగా అట్టు ఆకారంలో వేయండి.పైన ఉల్లిపాయ-పచ్చిమిర్చి మిశ్రమం, స్పెషల్ కారం పొడి చల్లండి. ఒకవైపు కాలాక రివర్స్ చేసి, మరోవైపు కూడా కొద్దిగా నూనె వేసి బంగారు రంగు వచ్చేలా కాల్చండి. రెండు వైపులా కాలాక ప్లేట్‌లోకి తీసుకోండి.
అంతే! క్రిస్పీ, స్పైసీ కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు రెడీ!మీ ఇష్టమైన చట్నీ (అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ)తో సర్వ్ చేస్తే... టేస్ట్ బాంబ్!


