Coconut Tomato Rasam:వానొచ్చినా… చలేసినా… ఒక్కసారి ఈ టమాటో కొబ్బరి రసం తింటే… స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది!

Coconut Tomato Rasam
Coconut Tomato Rasam:వానొచ్చినా… చలేసినా… ఒక్కసారి ఈ టమాటో కొబ్బరి రసం తింటే… స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది..వేడి అన్నంలో కలిపి ఒక్క ముద్ద… అబ్బో… ఇంద్రలోకమే!

ముఖ్యంగా వర్షం కురుస్తున్నప్పుడు, చల్లని గాలి వీస్తున్నప్పుడు లేదా జ్వరంతో నోరు రుచి పోయినప్పుడు… ఈ కమ్మటి, రుచికరమైన టమాటో కొబ్బరి రసం అద్భుతంగా పని చేస్తుంది. టమాటో ఆమ్లం, కొబ్బరి తీయటం, మిరియాలు-వెల్లుల్లి సుగంధం… అన్నీ కలిసి ఒక మ్యాజిక్‌లా పనిచేస్తాయి.ఇంట్లో చాలా ఈజీగా 20–25 నిమిషాల్లోనే రెడీ చేసేయొచ్చు. రండి చూచేద్దాం!
ALSO READ:మల్లెపూల్లాంటి మెత్తని రెస్టారెంట్ స్టైల్ ఖుష్బూ ఇడ్లీ – ఇంట్లోనే సూపర్ సాఫ్ట్‌గా రెడీ..
కావలసిన పదార్థాలు (4 మందికి)
టమాటో - 4 పెద్దవి (పండినవి)
తాజా కొబ్బరి (ముక్కలు లేదా తురుము) - ½ కప్పు
చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజు
పేస్ట్
పచ్చిమిర్చి - 3–4 (చీలికలు)
ఎండుమిర్చి - 3
మిరియాలు - 1 టీస్పూన్
వెల్లుల్లి - 6–7 రెబ్బలు
ఉల్లిపాయ - 1 పెద్దది (సన్నగా తరిగినది)
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - చిటికెడు
ఉప్పు, కారం - మీ రుచికి తగినంత
నెయ్యి - 1 టీస్పూన్ 
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (తరుగు)
నూనె - 2–3 టేబుల్ స్పూన్లు

తయారు విధానం (సులభ స్టెప్స్‌తో)
టమాటోలకు పైన ‘X’ ఆకారంలో నాలుగు గాట్లు పెట్టండి (తొక్క ఈజీగా వచ్చేలా).ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, టమాటోలు వేసి 4–5 నిమిషాలు ఉడికించండి. తొక్క ఈజీగా వచ్చేస్తుంది. వేడిగానే తొక్క తీసేయండి.మిక్సీ జార్‌లో తొక్క తీసిన టమాటో + కొబ్బరి ముక్కలు + చింతపండు పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
ALSO READ:నోరూరించే మష్రూమ్ పరాఠా – తింటూనే బరువు తగ్గే మ్యాజిక్ రెసిపీ!
మిరియాలు + వెల్లుల్లి రెబ్బలు (5–6) కచ్చాపచ్చాగా దంచుకోండి లేదా మిక్సీలో ఒక్క పల్స్ ఇచ్చేయండి.బాణలిలో నూనె వేడయ్యాక → ఆవాలు, మినపపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించండి.

ఉల్లిపాయ తరుగు వేసి కాస్త గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి.దంచిన వెల్లుల్లి-మిరియాలు మిశ్రమం వేసి 30 సెకన్లు వేయించండి (అదిరిపోతుంది సుగంధం!).గ్రైండ్ చేసిన టమాటో-కొబ్బరి పేస్ట్ పోసి, అవసరమైనన్ని నీళ్లు (సాధారణంగా 3–4 కప్పులు) పోసి కలపండి.
ALSO READ:కరకరలాడే పనీర్ 65 – రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే..పైన సూపర్ క్రిస్పీ… లోపల సాఫ్ట్
పసుపు, ఉప్పు, కారం వేసి మరగబెట్టండి. 7–8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడుకనివ్వండి.చివరి ఒక నిమిషంలో కొత్తిమీర, నెయ్యి వేసి మూత పెట్టి 1 నిమిషం ఆగండి.

అంతే… మీ అద్భుతమైన టమాటో కొబ్బరి రసం రెడీ! వేడి వేడి అన్నంలో కలిపి, పైన ఒక చెంచా నెయ్యి కూడా వేసుకుంటే… రుచి చూడండి ఒక్కసారి… మళ్లీ మళ్లీ చేయించుకుంటారు ఇంట్లోవాళ్లు.. చలి కాలంలో ఇది బెస్ట్ కంఫర్ట్ ఫుడ్… 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top