Garlic pappula Podi :పప్పుల పొడి అన్నం, టిఫిన్స్ లోకి టేస్టీగా వుంటుంది.. ఇలా సింపుల్ గా చేసేయండి.. ఆహారంలో వివిధ రకాల పొడులు తీసుకుంటూనే ఉంటాం. చాలా మందికి అన్నం ముద్దకి కాస్త పొడి కలిపి తినే అలవాటు ఉంటుంది. అందుకే పల్లీలు, కరివేపాకు, పుట్నాలతో పొడులు చేస్తుంటారు. కానీ రోజూ ఒకటే తింటే బోర్ కొడుతుంది కదా!
అందుకే ఇవాళ ఓ కొత్త రుచికరమైన రెసిపీ తెచ్చాం - అదే వెల్లుల్లి పప్పుల పొడి. ఈ విధానంలో చేస్తే టేస్ట్ సూపర్‌గా వస్తుంది. టిఫిన్స్‌లోనే కాక, రైస్‌తో కూడా అద్భుతంగా ఉంటుంది. సింపుల్‌గా కొద్ది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ ఆనందంగా తింటారు. ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. మరి వెల్లుల్లి పప్పుల పొడి చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం!
Also Read:నోట్లో వేసుకోగానే కరిగిపోయే చాలా ఈజీగా "అంగూరీ గులాబ్ జామున్" చేసేయండికావాల్సిన పదార్థాలు:
- వెల్లుల్లి - 100 గ్రాములు
- పుట్నాలు - 150 గ్రాములు
- ఎండుమిర్చి - 15
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- రాళ్ల ఉప్పు (దొడ్డుప్పు) - రుచికి తగినంత
- నూనె - 5 టేబుల్ స్పూన్లు
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- చింతపండు - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా 100 గ్రాముల వెల్లుల్లిని పొట్టుతో సహా మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. (పొట్టు తీసి కూడా వాడవచ్చు). ఈ పేస్ట్‌ను ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి.స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, 150 గ్రాముల పుట్నాలు వేసి లో ఫ్లేమ్‌లో కాస్త వేయించండి. తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి.
Also Read:నోరూరించే మొఘలాయి ఎగ్ కర్రీ – ఇలా చేస్తే కమ్మగా, వదలకుండా తినేస్తారు..అదే కడాయిలో 15 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగిన రాళ్ల ఉప్పు వేసి ఒక నిమిషం వేగనివ్వండి. ఆ తర్వాత ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వండి.ఇదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడెక్కాక, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఫ్రై చేయండి. పల్లీలు గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ప్లేట్‌లోకి తీసుకోండి.
మిగిలిన నూనెలో గ్రైండ్ చేసిన వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి.ఇప్పుడు మిక్సీ జార్‌లో ఫ్రై చేసిన పల్లీలు, ఎండుమిర్చి-జీలకర్ర మిశ్రమం, కొద్దిగా చింతపండు, వేయించిన పుట్నాలు వేసి మెత్తగా పొడి చేయండి. ఈ పొడిలోనే ఫ్రై చేసిన వెల్లుల్లి కూడా వేసి మళ్లీ మిక్సీ పట్టండి.
అంతే! రుచికరమైన వెల్లుల్లి పప్పుల పొడి రెడీ! దోశ, ఇడ్లీతోనే కాకుండా, వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే టేస్ట్ అద్భుతం. ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టితే నెల రోజులు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!


