Ragi Soup:కేవలం 10 నిమిషాల్లో మిక్స్ వెజ్ రాగి సూప్ ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారు

Ragi Soup
Ragi Soup:కేవలం 10 నిమిషాల్లో మిక్స్ వెజ్ రాగి సూప్ ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారు.. రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇవి మిల్లెట్స్ రకానికి చెందినవి. ముఖ్యంగా రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.

రాగులను వివిధ రూపాల్లో తీసుకుంటారు. కొందరు రాగి జావ తయారు చేసుకుంటారు. మరికొందరు రాగి మాల్ట్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. ఇంకొందరు రాగులతో స్వీట్స్ చేసుకుంటారు. అలాగే ముద్దలు, కుడుములు కూడా తయారు చేస్తారు. అధిక బరువు సమస్య ఉన్నవారు రాగులను రోజూ తీసుకోవడం ద్వారా బరువును సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:ఈ ఐదు సూపర్ డ్రింక్స్ మీ ఆహారంలో చేర్చుకుంటే.. కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలకు సహజ చూమంత్రం!
అయితే, రాగులతో రుచికరంగా ఉండే రాగి సూప్ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు. చలికాలంలో ఈ వేడి వేడి రాగి సూప్‌ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తాగవచ్చు. ఈ ఆరోగ్యకరమైన రాగి సూప్‌ను ఎలా తయారు చేయాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం...

కావలసిన పదార్థాలు: రాగి పిండి (తగినంత), టమాటాలు (2), ఉల్లిపాయలు (2), బీన్స్, క్యారెట్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం, నెయ్యి లేదా నూనె.

తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఒక గిన్నె పెట్టి, అందులో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. నూనె వేడెక్కాక, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేలా వేయించాలి.

తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారాక, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి 5-6 నిమిషాలు వేయించాలి.

ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి, మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఈ మిశ్రమంలో ఉప్పు వేసి, సరిపడా నీళ్లు పోసి మరో 5 నిమిషాలు మరిగించాలి.
Also read:పొట్టు మినపప్పును పక్కన పెట్టేస్తున్నారా.. తింటే పుట్టెడు లాభాలు..
ఇది మరుగుతున్న సమయంలో, చిన్న గిన్నెలో రాగి పిండి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా స్పూన్‌తో చిక్కగా కలుపుకోవాలి.

స్టవ్ మీద మరుగుతున్న మిశ్రమంలో ఈ రాగి పిండి పేస్ట్‌ను నెమ్మదిగా వేస్తూ, అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మరో 3-4 నిమిషాలు మరిగించాలి.

చివరగా మిరియాల పొడి, తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి, నిమ్మరసం పిండుకుని సర్వ్ చేయాలి.

వేడి వేడి, ఆరోగ్యకరమైన రాగి సూప్ రెడీ!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top