Udupi style veg pulao:నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీ ఉడుపి వెజ్ పులావ్.. రుచి అద్దిరిపోతుంది!

Udipi style veg pulao
Udupi style veg pulao:నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీ ఉడుపి వెజ్ పులావ్.. రుచి అద్దిరిపోతుంది.. బిర్యానీ అంటే హైదరాబాద్, పులావ్ అనగానే గుంటూరు, గోదావరి జిల్లాలు గుర్తుకు వస్తాయి. పులావ్ విషయంలో తెలుగువారి రుచులకు మించినది ఏదీ లేదు. అయితే, ఒకసారి ఇలా ఉడుపి స్టైల్ వెజ్ పులావ్ ట్రై చేసి చూడండి. 

ఎప్పుడూ ఒకేలా కాకుండా, ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి రుచి చూడాల్సిందే. ఎన్నడూ తెలియని ఏదో ఒక కొత్త రుచి దొరుకుతుంది ఖాయం. ఈ పులావ్ తయారీ భిన్నంగా ఉంటుంది. పైగా కొబ్బరి తురుము వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. మీకు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు.
Also Read:నోరూరించే మష్రూమ్ పరాఠా.. తింటూ బరువు తగ్గొచ్చు.. ఎలా తయారు చేసుకోవాలంటే..
కావలసిన పదార్థాలు:
  • కొత్తిమీర - చిన్న కట్ట
  • పుదీనా - కొద్దిగా
  • అల్లం - చిన్న ముక్క
  • పచ్చిమిర్చి - 3
  • కొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూన్
  • లవంగాలు - 4
  • దాల్చిన చెక్క - 1 ఇంచు
  • జాపత్రి - కొద్దిగా
  • జీడిపప్పు - 10
  • నూనె - 2 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • బిర్యానీ ఆకు - 1
  • సోంపు - అర టీ స్పూన్
  • ఆలుగడ్డ - 1
  • క్యారెట్ - 1
  • పచ్చి బఠానీ - 2 టేబుల్ స్పూన్
  • బీన్స్ - 10
  • క్యాప్సికం - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బియ్యం - 1 కప్పు
  • నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్

తయారీ విధానం:
ముందుగా 1 కప్పు బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, నానబెట్టుకోవాలి.మిక్సీ జార్‌లో చిన్న కట్ట కొత్తిమీర (కాడలతో సహా), పుదీనా, అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
Also Read:కాలీఫ్లవర్‌లోని పురుగులను సులభంగా ఇలా తొలగించండి
స్టవ్ మీద కడాయి పెట్టి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ సోంపు వేసి 2 నిమిషాలు వేయించాలి.ఆలుగడ్డను పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రంగు మారే వరకు వేయించాక, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, బీన్స్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కలిపి వేయించాలి.

మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 నిమిషాలు క్రిస్పీగా వేయించాలి.గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసి, 2 కప్పుల వేడి నీళ్లు (కొద్దిగా తక్కువగా) పోసుకోవాలి.
నానబెట్టిన బాస్మతి బియ్యం నీళ్లు వడబోసి వేసుకుని కలపాలి. 

చివరగా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, మూత పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి.ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నట్లయితే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల నీళ్లు సరిపోతాయి.
బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు వాడితే డబుల్ నీళ్లు (2 కప్పులు) పోయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top