Aloo Curry:ఆలూ కర్రీ ని కుక్కర్ లో10నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి.. రైస్ చపాతీ పులావ్ లో సూపర్.. ఉదయం ఇంట్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. టిఫిన్, లంచ్ సన్నాహాల్లో గృహిణులు బిజీ అవుతారు. అలాంటి టైమ్‌లో తక్కువ పదార్థాలతో ఈజీగా, సింపుల్‌గా చేసే రెసిపీ ఇది. లంచ్‌తో పాటు చపాతీకి కూడా సూట్ అవుతుంది. అదే బంగాళదుంప కర్రీ! కుక్కర్‌లో నిమిషాల్లో రెడీ. ఈ మెథడ్ ఫాలో అయితే టేస్ట్ అదిరిపోతుంది!
Also Read:ఇడ్లీ, సాంబార్లో కి ఎంత రుచికరంగా ఉండే రోడ్ సైడ్ సాంబార్ ... రుచి అమోఘం..కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు - 2 (మీడియం సైజ్)
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - ½ టీ స్పూన్
జీలకర్ర - ½ టీ స్పూన్
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 4 (సన్నగా తరిగినవి)
పుదీనా - కొద్దిగా (తరిగినది)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
టమోటా - 2 (పేస్ట్‌గా చేసినది)
ఉప్పు - 1 టీ స్పూన్ + రుచికి తగినంత
పసుపు - ½ టీ స్పూన్
కారం పొడి - 2 టీ స్పూన్లు
ధనియాల పొడి - 1½ టీ స్పూన్
గరం మసాలా - ¼ టీ స్పూన్
జీలకర్ర పొడి - ½ టీ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
నీళ్లు - 1 కప్పు
Also read:ఈ చిన్న లడ్డూతో కొండంత ఆరోగ్యం..! శీతాకాలంలో రోజూ ఒక్కటి తినండి, ఎటువంటి వ్యాధులు రావు..తయారీ విధానం (స్టెప్ బై స్టెప్):
రెండు బంగాళదుంపలు కడిగి, పొట్టు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి. నీళ్లలో నానబెట్టి పక్కన పెట్టండి.రెండు టమోటాలు తరిగి మిక్సీలో మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. గిన్నెలోకి తీసి పక్కన ఉంచండి.
కుక్కర్‌లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఆవాలు (½ టీస్పూన్), జీలకర్ర (½ టీస్పూన్) వేసి పేల్చండి.సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 టీస్పూన్ ఉప్పు, ½ టీస్పూన్ పసుపు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా కూడా వేసి కలిపి వేగనివ్వండి.
1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. టమోటా పేస్ట్ వేసి నూనె కొద్దిగా వేరయ్యే వరకు ఫ్రై చేయండి.నానబెట్టిన బంగాళదుంప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఫ్రై చేయండి.
కారం పొడి (2 టీస్పూన్లు), ధనియాల పొడి (1½ టీస్పూన్), గరం మసాలా (¼ టీస్పూన్), జీలకర్ర పొడి (½ టీస్పూన్), రుచికి తగిన ఉప్పు వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించండి.1 కప్పు నీళ్లు పోసి బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
ప్రెషర్ వదిలిన తర్వాత, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.వేడి వేడి అన్నం లేదా చపాతీతో సర్వ్ చేయండి. సింపుల్‌గా, నిమిషాల్లో రుచికరమైన బంగాళదుంప కర్రీ మీ ముందు!


