Abc Juice:30 రోజులు ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మెరిసిపోతారు.. బరువు తగ్గుతారు.. ఈ జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా, గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తాగితే అనేక ప్రమాదకరమైన సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే కాకుండా, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో హీమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
Also Read:ఖాళీ కడుపుతో చిన్న ముక్క తింటే చాలు .. ఈ వ్యాధులు దూరంమంచి ఆరోగ్యం కోసం కొన్ని రకాల జ్యూస్‌లను ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పండ్లు, కూరగాయల జ్యూస్‌లలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ అంటే ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లతో తయారుచేసే జ్యూస్. ఇందులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి.
ఏబీసీ జ్యూస్‌లో 8 నుంచి 9 గ్రాముల వరకు చక్కెర, విటమిన్లు, ఖనిజాలు, 0.5 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవు. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలు పూర్తిగా శుభ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 100 మిల్లీలీటర్ల ఏబీసీ జ్యూస్ తీసుకుంటే 45-50 కేలరీలు, 10-12 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయని నిపుణులు తెలిపారు.
ఏబీసీ జ్యూస్ తాగితే చర్మం మెరిసిపోతుంది, జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగకరం. ఇందులో కేలరీలు చాలా తక్కువ.
ఈ జ్యూస్ తాగితే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది, పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని క్యారెట్లు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


