Mulberry Fruits:ఈ పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి...మీ వయస్సు తగ్గించే సంజీవనీ... మల్బరీ అని పిలువబడే ఈ పండ్లు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. సాధారణంగా ఇవి బొంత పండ్లు అని కూడా అనిపిస్తాయి. మల్బరీలు బ్లాక్‌బెర్రీల్లా కనిపించినా, రుచిలో ద్రాక్షలాగా ఉంటాయి.
ఇవి నలుపు, ఎరుపు, తెలుపు – మూడు రంగుల్లో లభిస్తాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోన్యూట్రియెంట్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయని నిపుణులు తెలిపారు. మరిన్ని ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..
మల్బరీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో, పోరాడటంలో సహాయపడుతుంది. చిన్నగా కనిపించినా, బరువు తగ్గించడంలో గొప్పగా ఉపయోగపడతాయి. ఎముకల బలోపేతానికి ఇనుము, కాల్షియం అవసరం – ఈ రెండూ మల్బరీలో ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఎముకలు బలహీనం కావు.
ఈ జ్యూసీ పండ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మానికి మేలు చేస్తాయి. ఈ వేసవి పండ్లు ఎక్కడ చూసినా తీసుకోండి.. మల్బరీలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్, విటమిన్లు సి, ఈ, కె, బి1, బి2, బి3, బి6, ఫోలేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
పాలీఫెనాల్ పిగ్మెంట్ యాంటీఆక్సిడెంట్లు, లిపిడ్లు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. మల్బరీలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు వస్తాయి. జీర్ణక్రియకు మేలు చేసే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగు కదలికలను సులభతరం చేసి, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిప్పలను తగ్గిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
మల్బరీలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఆంథోసైనిన్‌లు ఉంటాయి. రెస్వెరాట్రాల్ కూడా ఉంది. ఇవి క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉంటాయి. పెద్దప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్‌లతో పోరాడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. హైపర్‌టెన్షన్‌ను అదుపులో ఉంచుతాయి. ఇనుము ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి. విటమిన్ సి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. విటమిన్ కె, కాల్షియం, ఇనుము ఎముకలను బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్, ఎముక క్షయం నుంచి రక్షిస్తాయి.
ఇటలీలోని ఎఫ్. డి రిటిస్ ఇన్‌స్టిట్యూట్ & కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ అధ్యయనంలో.. రోజూ 1,300 కేలరీల డైట్‌లో మల్బరీలు తీసుకున్నవారు మూడు నెలల్లో 10% బరువు తగ్గారని తేలింది.
(NOTE: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా ఆధారంగా ఇవ్వబడింది. ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించండి)


