Guntur Malpuri Recipe:గుంటూరు స్పెషల్ మాల్పూరి - పర్ఫెక్ట్ రెసిపీతో సూపర్ టేస్టీగా తయారు చేయండి..స్వీట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇంట్లో సాధారణ మిఠాయిలు చేస్తూ ఉంటాం కానీ, ఈసారి గుంటూరు స్పెషల్ మాల్పూరిని ట్రై చేస్తే... వావ్! అదిరిపోతుంది.
క్రిస్పీ పూరీలు, స్వీట్ సిరప్, మధ్యలో క్రీమీ కోవా... ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇంట్లో ఈ ఈజీ పద్ధతి పాటిస్తే పర్ఫెక్ట్ మాల్పూరి వస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే చూద్దాం ఎలా తయారు చేయాలో!
కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి - అర కప్పు
గోధుమ పిండి - 2 కప్పులు
పాలు - 250 ml
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
మిల్క్ పౌడర్ - 1½ కప్పు
పంచదార - 2 కప్పులు
యాలకుల పొడి - 1 టీస్పూన్
డీప్ ఫ్రైకి - సరిపడా నూనె
అవసరమైతే - కొద్దిగా చల్లార్చిన పాలు (కోవా సాఫ్ట్ చేయడానికి)
ALSO READ:రాత్రి పడుకునే ముందు ఒక లవంగం తినడం లేదా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్టే..తయారీ విధానం (స్టెప్ బై స్టెప్):
ముందుగా పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. అందులో 250 ml పాలు పోసి, ఒక మరుగు వచ్చే వరకు కలుపుతూ ఉంచండి. పాలు మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌పై ఉంచి, 1½ కప్పు మిల్క్ పౌడర్‌ను కొద్దికొద్దిగా వేస్తూ 15 నిమిషాలు బాగా కలుపుతూ గట్టిగా అయ్యే వరకు ఉడికించండి. కోవా రెడీ అయ్యాక మరో గిన్నెలోకి తీసి పక్కన పెట్టండి.
ఒక గిన్నెలో 2 కప్పుల పంచదార, 1½ కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌పై కరిగించండి. పంచదార పూర్తిగా కరిగాక, అందులోంచి ¼ కప్పు పాకాన్ని వేరు చేసి పక్కన పెట్టండి. మిగతా పాకంలో ½ టీస్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.
మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల గోధుమ పిండి, అర కప్పు మైదా పిండి వేయండి. కొద్దికొద్దిగా నీళ్లు (సుమారు 2½ కప్పులు) పోస్తూ దోసె పిండి లాగా సన్నగా కలపండి. అందులో వేరు చేసి పెట్టుకున్న ¼ కప్పు షుగర్ సిరప్ పోసి బాగా మిక్స్ చేయండి.
కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడెక్కించండి. నూనె వేడైన తర్వాత గరిటెతో కొద్దిగా పిండి తీసుకొని ఒకే చోట పోసి పూరీ షేప్‌లో వేయండి. ఒక నిమిషం తర్వాత తిప్పి, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి.
వేయించిన పూరీలను వెంటనే యాలకుల పాకంలో వేసి 1 నిమిషం నాననివ్వండి. తర్వాత ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వండి.
కోవా గట్టిగా అయితే, అందులో 3 టేబుల్ స్పూన్ల చల్లార్చిన పాలు పోసి సాఫ్ట్‌గా కలపండి. పాకం నానిన పూరీలను తీసుకొని మధ్యలో కోవా పెట్టి, ఒక వైపు మడత పెట్టండి.
అంతే! రుచికరమైన గుంటూరు స్టైల్ మాల్పూరి రెడీ. వేడివేడిగా సర్వ్ చేస్తే సూపర్ టేస్ట్! ఇంట్లో అందరూ ఫిదా అవుతారు. ట్రై చేసి చూడండి..


