White Hair:తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే సింపుల్ హోమ్ రెమెడీ...ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య చాలా మందిని బాధిస్తోంది. ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు వంటివి దీనికి ప్రధాన కారణాలు. మార్కెట్‌లో దొరికే కెమికల్ హెయిర్ డైలు తాత్కాలిక ఫలితాలు ఇస్తాయి కానీ, జుట్టు రాలడం, పొడి బారడం, నిర్జీవంగా మారడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి.
అందుకే సహజ మార్గాలు బెస్ట్ ఆప్షన్! ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు చెఫ్ స్నేహ సింఘి షేర్ చేసిన ఈ సింపుల్ చిట్కాతో ఇంట్లోనే రసాయన రహిత హెయిర్ డై తయారు చేసుకోవచ్చు. నల్ల నువ్వులు, టీ పొడి, ఉసిరి పొడి – ఈ మూడు పదార్థాలు మాత్రమే చాలు.
ALSO READ:ఇంట్లో నాన్-స్టిక్ పాన్ వాడుతున్నారా? ఆరోగ్య రిస్క్‌ల గురించి తెలుసుకోండి!కావాల్సిన పదార్థాలు:
నల్ల నువ్వులు – 1½ టేబుల్ స్పూన్
టీ పొడి (బ్లాక్ టీ పౌడర్) – 1½ టేబుల్ స్పూన్
ఉసిరి పొడి – 3 టేబుల్ స్పూన్లు
ఆవాల నూనె – 2 టేబుల్ స్పూన్లు (పేస్ట్ తయారీకి)
తయారీ విధానం:
ఇనుప కడాయి తీసుకుని (ఇనుప కడాయి ఉపయోగిస్తే మరింత మంచిది) ముందుగా నల్ల నువ్వులు వేసి మీడియం మంట మీద వేయించండి.అవి కాస్త వేగిన తర్వాత టీ పొడి, ఉసిరి పొడి కలిపి బాగా కలుపుతూ వేయించండి.
మిశ్రమం పూర్తిగా ముదురు నలుపు రంగులోకి మారే వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేయండి.చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి.జల్లెడ ద్వారా వడకట్టి, గాలి చొరబడని బాటిల్‌లో స్టోర్ చేయండి. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది.
వాడే విధానం:
2 చెంచాల ఈ పొడిని తీసుకుని, ఆవాల నూనెలో కలిపి మెత్తని పేస్ట్ తయారు చేయండి.ఈ పేస్ట్‌ను తెల్ల వెంట్రుకలపై బాగా అప్లై చేయండి.8-10 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం సాధారణ నీటితో కడిగేయండి.
మరుసటి రోజు రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయండి.తాత్కాలిక కవర్ కావాలంటే: పొడిని అలోవెరా జెల్‌లో కలిపి అప్లై చేసి, కాసేపు ఉంచి కడిగేయండి.
ఎందుకు పని చేస్తుంది?
నల్ల నువ్వుల్లో కాపర్, ఐరన్; ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు; టీ పొడిలో టానిన్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు సహజ రంగు ఇస్తూ, మెలనిన్ ఉత్పత్తిని పెంచి తెల్ల జుట్టును క్రమంగా నల్లగా మార్చడంలో సహాయపడతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
ALSO READ:"చిలకడదుంప vs బంగాళదుంప: వెయిట్ లాస్‌కి ఏది బెటర్?ముఖ్యమైన చిట్కాలు:
మొదటిసారి వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి (చేయి మీద కాస్త అప్లై చేసి చూడండి).ఫలితాలు కనిపించడానికి క్రమం తప్పకుండా 2-3 వారాలు వాడండి.తెల్ల జుట్టు చాలా ఎక్కువ ఉన్నా లేదా గతంలో కెమికల్ డై వాడినా ఫలితాలు మారవచ్చు.
మంచి ఫలితాల కోసం: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా/మెడిటేషన్ చేయండి.
ఈ సహజ రెమెడీతో కెమికల్స్ లేకుండా మీ జుట్టు మళ్లీ నల్లగా, ఆరోగ్యంగా మారాల్సిందే! ట్రై చేసి చూడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


