KItchen Tips:కూర మాడిపోయిందా? బయటికి పారేయకండి... ఈ సులభ చిట్కాలతో రుచికరంగా మార్చేయండి..
వంటలో ఎక్కువసార్లు కూరగాయల కూర అడుగున అంటుకుపోతుంది. గ్యాస్ మంట ఎక్కువగా ఉండటం, శ్రద్ధ లేకపోవడం లేదా నీళ్లు తక్కువగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణాలు. మాడిన కూరలో చేదు రుచి, దుర్వాసన వచ్చేస్తుంది.
చాలామంది ఇలాంటి వంటకాన్ని పడేసేస్తారు. కానీ ప్రతి మాడిన కూరనూ పారేయాల్సిన అవసరం లేదు! కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఆహార వృధాను తగ్గించి, కూరను మళ్లీ రుచికరంగా తినొచ్చు.
ALSO READ:ఖాళీ కడుపుతో టీ తాగకూడదు... ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే ముఖ్యంగా జాగ్రత్త!ముందుగా కూర ఎంతవరకు మాడిందో చూడండి. కొద్దిగా అడుగు అంటినట్లయితే, వెంటనే ఆ పాత్ర నుంచి కూరను వేరే గిన్నెకు మార్చండి. అలా చేయకపోతే మాడిన వాసన మరింత పెరిగిపోతుంది.
మాడిన రుచి, వాసన తగ్గించే సులభ పద్ధతులు:
తీపి చేర్చండి: చేదు రుచిని తగ్గించడానికి చిటికెడు చక్కెర, బెల్లం ముక్క లేదా తేనె కలపండి. ఇది మాడిన రుచిని బ్యాలెన్స్ చేస్తుంది.
పులుపు వాడండి: నిమ్మరసం, ఆమ్చూర్ (మామిడి పొడి) లేదా పెరుగు కలపండి. పెరుగు లేదా క్రీమ్ వేస్తే కూర మరింత క్రీమీగా, రుచికరంగా మారుతుంది.
కొత్త తాజా మసాలా తయారు చేయండి: మసాలాలు మాడిపోయి ఉంటే, వేరే మూకుడులో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేయించి కొత్త పోపు పెట్టండి. అందులో మాడిన కూర వేసి, కొద్దిగా వేడి నీళ్లు, ఉప్పు కలిపి మళ్లీ వేడి చేయండి. చివర్లో తాజా కొత్తిమీర చల్లితే కూర తాజాగా అనిపిస్తుంది.
దుర్వాసన తొలగించే చిట్కాలు:
పచ్చి బంగాళదుంప ముక్కలు కత్తిరించి 5-10 నిమిషాలు కూరలో ఉంచండి. అవి వాసనను పీల్చేస్తాయి. తర్వాత తీసేయండి.
వేడి బొగ్గు ముక్కపై నెయ్యి లేదా ఆవనె వేసి, చిన్న గిన్నెలో పెట్టి కూర పాత్రలో ఉంచి మూత పెట్టండి. 5-10 నిమిషాల్లో మాడిన వాసన పూర్తిగా పోతుంది.
ALSO READ:కుంకుమపువ్వు పాలు లేదా నీరు: ఏది ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది..మాడిన కూరను వేరే వంటకంగా మార్చండి: నేరుగా తినలేకపోతే, పరాఠా పిండిలో కలిపి స్టఫ్డ్ పరాఠాలు చేయండి. లేదా పప్పు, దాల్‌తో కలిపి వండండి – చేదు రుచి అస్సలు తెలియదు.
ఇలాంటి సులభమైన చిట్కాలతో వంటలో వృధాను తగ్గించి, కూరను రుచికరంగా ఆస్వాదించవచ్చు. మరుసటి సారి కూర మాడినా టెన్షన్ పడకండి – ఈ టిప్స్ ట్రై చేయండి!
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


