హాయ్ ఫ్రెండ్స్!.. వయసు పెరిగే కొద్దీ, బరువు తగ్గినప్పుడు లేదా మహిళల్లో మెనోపాజ్ దశ దాటిన తర్వాత చర్మం సాగిపోవడం, ముఖంపై ముడతలు, మెడ దగ్గర గీతలు రావడం సర్వసాధారణం. చర్మంలో కొల్లాజెన్ తగ్గిపోవడం వల్లే ఇలా జరుగుతుంది.
దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, కొల్లాజెన్ ప్యాక్‌లు వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే దొరికే కేవలం 3 సహజసిద్ధమైన పదార్థాలతో అద్భుతమైన స్కిన్ టైటెనింగ్ సీరమ్‌ను ఎలా తయారుచేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం!
కావలసిన పదార్థాలు
వరి అన్నం గంజి: 2 స్పూన్లు (బియ్యం ఉడికించి వార్చిన గంజి - ఇందులో బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి)
కలబంద గుజ్జు (Aloe Vera Gel): 2 స్పూన్లు (తాజా కలబంద నుంచి తీసిన స్వచ్ఛమైన గుజ్జు)
విటమిన్-E ఆయిల్: 2 స్పూన్లు (మెడికల్ షాపుల్లో దొరికే విటమిన్-E క్యాప్సూల్స్ నుంచి తీసిన నూనె)
తయారుచేసే విధానం:
ఒక చిన్న గాజు గిన్నె లేదా సీసాలో 2 స్పూన్ల అన్నం గంజి, 2 స్పూన్ల కలబంద గుజ్జు, 2 స్పూన్ల విటమిన్-E ఆయిల్ (అన్నీ సమాన పాళ్లలో 1:1:1 నిష్పత్తిలో) వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమంపై మూతపెట్టి ఒక రోజంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజుకి ఇది చక్కటి సీరంలా సిద్ధమవుతుంది.
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తయారుచేసి పెట్టుకున్న మిశ్రమం నుంచి కేవలం 2 లేదా 3 చుక్కలు మాత్రమే చేతిలోకి తీసుకోవాలి.
ముఖానికి, మెడ భాగానికి కింద నుంచి పైకి (Upward direction లో) సున్నితంగా 5 నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
మసాజ్ చేస్తున్నప్పుడే చర్మం బిగుతుగా మారడం మీరు గమనించవచ్చు. సీరం చర్మంలోకి పూర్తిగా ఇంకిన తర్వాత అలాగే నిద్రపోవచ్చు. ఉదయాన్నే లేచి సాధారణ నీటితో ముఖం కడుక్కోండి.
ముఖ్య గమనిక:
చాలా సున్నితమైన చర్మం (Sensitive skin) ఉన్నవారు దీన్ని ముఖానికి రాసే ముందు చేతిపై కొద్దిగా రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
ఎలాంటి కెమికల్స్ లేని ఈ సహజమైన చిట్కాను రోజూ పాటిస్తే కేవలం 2-3 రోజుల్లోనే చర్మంలో మంచి మార్పు, టైట్‌నెస్ కనిపిస్తుంది

