Masala Papad Curry:ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కేవలం 15 నిమిషాల్లో మసాలా పాపడ్ కర్రీ చేసేయండి..

Masala Papad Curry
Masala Papad Curry:ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కేవలం 15 నిమిషాల్లో మసాలా పాపడ్ కర్రీ చేసేయండి.. రాజస్తాన్‌కి చెందిన అతి ప్రజాదరణ పొందిన, సూపర్ సింపుల్ & అదిరిపోయే రుచి ఉండే వంటకం మసాలా పాపడ్ కర్రీ!

పప్పు పాపడ్‌తో చేసే ఈ కర్రీ రోటీ, చపాతీ, పుల్కా లేదా అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది.. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ సూపర్ సేవ్ చేస్తుంది!

కావలసిన పదార్థాలు (3-4 మందికి)
మినపప్పు / పెసరపప్పు పాపడ్ - 5
మీగడ గట్టిగా ఉన్న పెరుగు - 1 కప్పు (200 గ్రా.)
ఉల్లిపాయ (సన్నగా తరిగిన) - 1 పెద్దది
టమాటా (సన్నగా తరిగిన) - 1 పెద్దది
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చిమిర్చి (పొడవుగా చీల్చిన) - 2
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - ½ టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
పసుప - ½ టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్ (మీ స్పైస్ లెవెల్ ప్రకారం)
ధనియాల పొడి - 1½ టీస్పూన్
గరం మసాలా - ½ టీస్పూన్
శనగపిండి (బేసన్) - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - 1½ కప్పు
కొత్తిమీర - అలంకరణకు

తయారు చేసే విధానం (స్టెప్ బై స్టెప్)
పాపడ్‌లను మంట మీద రెండు వైపులా కాల్చి, చల్లారాక మీడియం సైజ్ ముక్కలుగా విరిచి పక్కన పెట్టుకోండి.

ఒక గిన్నెలో పెరుగు తీసుకొని మెత్తగా గిలకొట్టండి. అందులో పసుప, కారం, ధనియాల పొడి, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టండి.లోతైన పాన్‌లో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేయించి పచ్చి వాసన పోనివ్వండి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు, నూనె పైకి తేలే వరకు వేయించండి.మంటను సిమ్‌లో పెట్టి, తయారు చేసిన పెరుగు-మసాలా మిక్స్‌ని నెమ్మదిగా పోసి, వేసిన వెంటనే గరిటెతో బాగా కలుపుతూ 1 నిమిషం ఉడికించండి (పెరుగు పగలకుండా జాగ్రత్త!).
Also Read:అమృతమే తింటున్నంత కమ్మగా నోట్లోజారిపోయే క్యాబేజీ పాయసం
1½ కప్పు నీళ్లు పోసి, ఉప్పు వేసి కలిపి మీడియం మంట మీద మొదటి ఉడుకు వచ్చే వరకు ఉడికించండి.ఉడకడం మొదలైన తర్వాత మంట తగ్గించి, మూత పెట్టి 5-7 నిమిషాలు ఉడికించండి. గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలుతుంది.

చివరగా గరం మసాలా, తరిగిన కొత్తిమీర చల్లి కలపండి.స్టవ్ ఆఫ్ చేసే ముందు విరిచిన పాపడ్ ముక్కలు వేసి నెమ్మదిగా కలపండి. 1-2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి.

అంతే.. మీ సూపర్ టేస్టీ మసాలా పాపడ్ కర్రీ రెడీ! వేడి వేడి చపాతీ లేదా అన్నంతో సర్వ్ చేయండి.. రుచి చూడగానే మైమరిచిపోతారు! 

ట్రిప్: పాపడ్ ముక్కలు చివర్లోనే వేయండి, లేకపోతే మెత్తబడిపోతాయి. ఇష్టమైతే కొద్దిగా కసూరి మేథీ కూడా చివర్లో చల్లవచ్చు.. రుచి ఇంకా బాగుంటుంది!తిని చూసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి నాయనా! 

Also Read:క్యాటరింగ్ స్టయిల్లో ఆలూ గోబీ మసాలా గ్రేవీ.. సూపర్ గా ఉంటుంది ...

Also Read:ఈ పండ్ల‌ను మీరు ఎప్పుడైనా తిన్నారా..? ఈ ప్రయోజనాలు తెలిస్తే విడిచిపెట్ట‌కుండా తింటారు..!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top