Kobbari Vadalu: కరకరలాడే క్రిస్పీ కొబ్బరి వడ... తక్కువ నూనె, ఎక్కువ క్రిస్ప్ & రుచి.. తింటే వదలరు.. ఈసారి సాధారణ వడలు కాదు... పచ్చి కొబ్బరి, పుదీనా, కొత్తిమీరతో కలిపి చేసిన ఈ స్పెషల్ కొబ్బరి వడలు పైకి కరకరలాడే క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి అదిరిపోతాయి!
ముఖ్యంగా నూనె కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. తక్కువ పదార్థాలతో నిమిషాల్లో రెడీ అయ్యే ఈ ఈవెనింగ్ స్నాక్‌ను ఇంట్లో అందరూ ఇష్టంగా లాగేస్తారు. టీ టైమ్‌లో లేదా గెస్టులకు సర్వ్ చేయడానికి పర్ఫెక్ట్!
కావాల్సిన పదార్థాలు (సుమారు 15-20 వడలకు):
పెసరపప్పు (మూంగ్ దాల్) - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
పుదీనా ఆకులు - 1 కప్పు
కొత్తిమీర - కొద్దిగా (చిన్న కట్ట)
కరివేపాకు - కొద్దిగా
పచ్చిమిర్చి - 6
అల్లం పేస్ట్ (లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్) - 1 టేబుల్ స్పూన్
శనగపిండి (బేసన్) - 1 కప్పు
ఉల్లిపాయ తురుము లేదా సన్నగా తరిగిన ముక్కలు - 1 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ALSO READ:ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించే మ్యాజిక్ డ్రింక్తయారు విధానం (స్టెప్ బై స్టెప్):
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి.
మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి తురుము, పుదీనా ఆకులు, కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి ముతకగా గ్రైండ్ చేయండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మళ్లీ గ్రైండ్ చేయండి (చాలా మెత్తగా కాకుండా సగం గ్రైండ్ అయితే సరిపోతుంది).
ఒక పెద్ద గిన్నెలో గ్రైండ్ చేసిన మిశ్రమం తీసుకోండి. ఇందులో అల్లం పేస్ట్, శనగపిండి, నానబెట్టిన పెసరపప్పు (నీళ్లు పూర్తిగా వడకట్టి), ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపండి. పిండి చాలా గట్టిగా ఉండాలి – వడలు షేప్ చేయడానికి సరిపడా.
చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, పిండిని చిన్న చిన్న బంతులుగా తీసుకుని వడ ఆకారంలో (డోనట్ షేప్) చేయండి.
కడాయిలో నూనె వేడెక్కనివ్వండి (మీడియం హీట్‌లో). నూనె వేడైన తర్వాత వడలను జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసి, మొదటి 2 నిమిషాలు తాకకుండా వదిలేయండి.
తర్వాత గరిటెతో తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. టిష్యూ పేపర్ మీద తీసి నూనె వడకట్టండి.
అంతే! వేడివేడి కొబ్బరి వడలు రెడీ. మీ ఇష్టమైన కొబ్బరి చట్నీ లేదా టమాటో చట్నీతో సర్వ్ చేయండి – సూపర్ టేస్టీ!
టిప్స్:
ఎక్కువ మోతాదు చేయాలంటే అన్ని పదార్థాలను సమానంగా పెంచండి.
నూనె తక్కువగా పీల్చుకోవాలంటే పిండి గట్టిగా ఉండేలా చూసుకోండి మరియు నూనె బాగా వేడి అయిన తర్వాతే వేయండి.
ట్రై చేసి చూడండి... ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు ఖాయం..


