Masala bhat:మహారాష్ట్ర స్పెషల్ మసాలా భాత్ – ప్రెషర్ కుక్కర్‌లో 30 నిమిషాల్లో రెడీ! లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్... మహారాష్ట్ర ఇళ్లలో పెళ్లిళ్లు, పండుగల్లో తప్పకుండా మసాలాతో చేసే ఈ మసాలా భాత్ ఇప్పుడు తెలుగు ఇళ్లలోనూ సూపర్ హిట్ అయిపోయింది. బిర్యానీ టేస్ట్ ఉంటూనే, తయారీ మాత్రం చాలా ఈజీ & హెల్దీ. ఉదయం హడావిడిలో లంచ్ బాక్స్ ప్యాక్ చేయాల్సి వస్తే ఇది బెస్ట్ ఆప్షన్!
కావాల్సిన పదార్థాలు (4–5 మందికి)
మెయిన్:
బియ్యం (బాస్మతి/సోనా మసూరి) – 1½ కప్పు (30 నిమిషాలు నానబెట్టాలి)
నీళ్లు – 3 కప్పులు (వేడి నీళ్లు వాడితే ఇంకా బెటర్)
ALSO READ:తియ్యని .. పుల్లని ప్లాస్టిక్ పచ్చడి! ఒక్కసారి తింటే ఎవరైనా “వామ్మో.. సూపర్!” అని అరుస్తారు గ్యారంటీ...కూరగాయలు:
బంగాళాదుంప – 2 మీడియం (ముక్కలు)
క్యారెట్ – 1 పెద్దది (సన్నని ముక్కలు)
కాలీఫ్లవర్ – 10–12 చిన్న ముక్కలు
పచ్చి బఠాణీ (ఫ్రోజన్ కూడా ఓకే) – ½ కప్పు
ఉల్లిపాయ – 2 మీడియం (సన్నగా పొడవుగా తరిగినవి)
టమాటా – 1 పెద్దది (తరుగు)
తాలింపు & మసాలాలు:
నూనె – 4 టీస్పూన్లు
నెయ్యి – 2 టీస్పూన్లు
పల్లీలు (వేరుశెనగపప్పు) – 2½ టేబుల్ స్పూన్లు
ఆవాలు – ½ టీస్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
బిర్యానీ ఆకు – 2
లవంగాలు – 5, యాలకులు – 4, దాల్చినచెక్క – 2 అంగుళాలు, స్టార్ అనీస్ – 1
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 2 (చీలికలు)
కరివేపాకు – 1 రెమ్మ
పసుపు – ¼ టీస్పూన్
కారం పొడి – 1 టేబుల్ స్పూన్ (మీ స్పైస్ లెవెల్ ప్రకారం)
గోడా మసాలా – 1½ టేబుల్ స్పూన్ (ఇది రుచికి సీక్రెట్!)
బిర్యానీ మసాలా (ఆప్షనల్) – ½ టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
కొత్తిమీర – గార్నిష్ కోసం
ALSO READ:పనికిరాదు అనుకున్న మాడిన గిన్నెని కూడా ఈజీగా CLEAN చేయొచ్చు-తయారీ విధానం (స్టెప్ బై స్టెప్ – సూపర్ ఈజీ!)
బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టండి.5 లీటర్ ప్రెషర్ కుక్కర్‌లో 4 టీస్పూన్ల నూనె + 2 టీస్పూన్ల నెయ్యి వేడి చేయండి.ముందుగా పూర్తి మసాలాలు (బిర్యానీ ఆకు, లవంగా, యాలకులు, దాల్చినచెక్క, స్టార్ అనీస్) వేసి వేయించండి → ఆవాలు, జీలకర్ర పోపు పెట్టండి.
పల్లీలు వేసి చిటపటలాడనివ్వండి → ఉల్లిపాయలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించండి.అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి 30 సెకన్లు వేగనివ్వండి. క్యారెట్, ఆలూ, కాలీఫ్లవర్ ముక్కలు + పసుపు వేసి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వేయించండి (కాలీఫ్లవర్ మీద నలుపు మచ్చలు పడేదాకా).
టమాటా తరుగు, కారం పొడి, గోడా మసాలా, బిర్యానీ మసాలా, పచ్చిబఠాణీ, 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వండి (నూనె పైకి తేలుతుంది).నానబెట్టిన బియ్యం పోసి, చెమ్మ ఆరేదాకా 2 నిమిషాలు వేయించండి → కొత్తిమీర కొద్దిగా చల్లండి.
3 కప్పుల వేడి నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకుని ఒకసారి కలపండి. మూత పెట్టి → పెద్ద మంట మీద 2 విజిల్స్ → తర్వాత సిమ్‌లో 1 విజిల్ → స్టవ్ ఆఫ్ చేసి నాచురల్ ప్రెషర్ వదిలేయండి.
30 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి – రుచికరమైన, పూర్తిగా విడివిడిగా ఉన్న మసాలా భాత్ రెడీ!
అంతే.. రైతా లేదా పెరుగు + పచ్చడితో సర్వ్ చేయండి. లంచ్ బాక్స్‌లో కూడా చల్లారాక కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది.
ALSO READ:ఖరీదైన బాదం, వాల్‌నట్స్ కొనే బదులు… ఈ చలికాలంలో రోజూ ఈ డ్రై ఫ్రూట్ తింటే చాలు!

