Plastic Chutney Recipe:తియ్యని .. పుల్లని ప్లాస్టిక్ పచ్చడి! ఒక్కసారి తింటే ఎవరైనా “వామ్మో.. సూపర్!” అని అరుస్తారు గ్యారంటీ..భారతీయ వంటింట్లో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది కదా… కానీ “ప్లాస్టిక్ పచ్చడి” అంటేనే భయపడకండి! ఇది ప్లాస్టిక్‌తో చేసేది కాద 100% సహజమైన, అదిరిపోయే రుచికరమైన బెంగాలీ స్వీట్ చట్నీ.
పశ్చిమ బెంగాల్‌లో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో తప్పక వడ్డిస్తారు. దీన్ని పచ్చి బొప్పాయితో చేస్తారు. పంచదార పాకంలో ఉడికితే బొప్పాయి ముక్కలు గాజు లాగా పారదర్శకంగా, మెరిసిపోతూ కనిపిస్తాయి… అచ్చం కరిగిన ప్లాస్టిక్ లాగా! అందుకే దీని పేరు ప్లాస్టిక్ పచ్చడి (Plastic Chutney).
కావలసిన పదార్థాలు (4-5 మందికి)
పచ్చి బొప్పాయి (పచ్చగా, గట్టిగా ఉన్నది) – 1 మీడియం సైజు (సుమారు 500-600 గ్రా.)
పంచదార – 1½ కప్పు (బొప్పాయి బరువుకి సమానంగా లేదా కొంచెం ఎక్కువ)
నీళ్లు – 2 కప్పులు (పాకం కోసం)
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు (చాలా ముఖ్యం!)
యాలకుల పొడి – 1 చిటికెడు
ఎండు ద్రాక్ష – 1 గుప్పెడు
జీడిపప్పు ముక్కలు – 1 గుప్పెడు
ఉప్పు – 1 చిటికెడు
కలోంజి (నల్ల జీలకర్ర / ఒంగోలీ) – ¼ టీస్పూన్
సూపర్ టిప్స్ ముందే చెప్పేస్తాను:
బొప్పాయి ముక్కలు ఎంత పలుచగా కోస్తే అంత ఎక్కువ పారదర్శకంగా, ప్లాస్టిక్ లాగా వస్తాయి. తురుమితే తొందరగా అవుతుంది కానీ అసలు “ప్లాస్టిక్ లుక్” రాదు. కాబట్టి పలుచటి చిప్స్ లాగా కోసుకోండి.
తయారీ విధానం (స్టెప్ బై స్టెప్)
పచ్చి బొప్పాయిని బాగా కడిగి, పై తొక్క పూర్తిగా తీసేయండి. గింజలు, తెల్లటి పొర కూడా పూర్తిగా తొలగించండి. ఇప్పుడు చాలా పలుచటి చిన్న చతురస్రాకారపు ముక్కలుగా (పొటాటో చిప్స్ లాగా) కోసుకోండి.
ఒక గిన్నెలో నీళ్లు పొంగేలా మరిగించండి. అందులో బొప్పాయి ముక్కలు వేసి 5 నిమిషాలు మాత్రమే ఉడికించండి (సగం ఉడకాలి, పూర్తిగా మెత్తకూడదు). వెంటనే నీటిని వడకట్టి, ముక్కలను పక్కన పెట్టండి. ఈ స్టెప్ వల్ల పచ్చి వాసనే పోతుంది.
మరొక మందపాటి గిన్నె/కడాయిలో 2 కప్పుల నీళ్లు + 1½ కప్పు పంచదార వేసి మరిగించండి. పంచదార పూర్తిగా కరిగాక చిటికెడు ఉప్పు వేయండి (ఇది రుచిని బ్యాలెన్స్ చేస్తుంది).
Also Read:కేవలం నాలుగు గుడ్లతో 20 నిమిషాల్లో - ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మంచూరియా ఈజీగా చేసేయండి..పాకం మరుగుతున్నప్పుడే బ్లాంచ్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు వేసేయండి. మీడియం మంట మీద మూతపెట్టి 12-15 నిమిషాలు ఉడికించండి. మధ్యలో ఒక్కసారి కలపండి. ముక్కలు నీళ్లు పీల్చుకుని గాజు లాగా పారదర్శకంగా మారతాయి… ఇదే మ్యాజిక్ మూమెంట్!
పాకం తేనె లాంటి చిక్కదనం వచ్చాక (తీగ పాకం రాకూడదు), ఎండు ద్రాక్ష, జీడిపప్పు ముక్కలు, కలోంజి, యాలకుల పొడి వేసి బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసే 1 నిమిషం ముందు నిమ్మరసం పిండండి (ఇది పుల్లనిస్తుంది + చల్లారాక పంచదార క్రిస్టలైజ్ కాకుండా చూస్తుంది). పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక ఇంకా మెరిసిపోతూ కనిపిస్తుంది!
వడ్డించే విధానం
భోజనం చివర డెజర్ట్ లాగా
గోంగూర అన్నం, పులిహోర పక్కన సైడ్ డిష్‌గా
లేదా రాత్రి పూట్ ఒక్క స్పూన్ తీసుకుంటేనే మతిపోయే రుచి..


